‘శాకుంతలం’ వాయిదాతో సమంత ఎంత నష్టపోయిందో తెలుసా..పాపం..!!

టాలీవుడ్ లో భారీ సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. గుణశేఖర్ ఏడు సంవత్సరాల క్రితం అనుష్కతో భారీ గ్రాఫిక్స్ తో భారీ తారాగణంతో రుద్రమదేవి తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత గుణశేఖర్ మరో సినిమా విడుదల కాలేదు. సినిమా పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులకి సమంత‌తో శకుంతలం సినిమా చేస్తున్నట్టుు ప్రకటించాడు. గుణశేఖర్ ఈ సినిమాను కూడా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు.

Photo: Samantha shares the first look of ethereal Shaakuntalam | Filmfare.com

ఈ సినిమాపై సమంత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సమంత కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్‌ గుణశేఖర్ విడుదల చేశారు. అందులో ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఆ పోస్టర్ విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు గుణశేఖర్ మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌తో అందర్నీ షాక్ కి గురి చేశాడు.

Samantha's Shaakuntalam Gets A Release Date! Deets Inside

సమంత అభిమానులతో పాటు సిని అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వాయిదా వేయడంతో గుణశేఖర్ పై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడటంతో సమంత కెరీర్ కు భారీ నష్టం కలుగునుంది. ఈ సినిమా సమంత కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాని అనుకున్న టైం కు విడుదల అయితే ప్రొడ్యూసర్‌ల‌పై భారం తక్కువగా ఉంటుంది. వాయిదాలు పడుతూ వస్తే సినిమా బడ్జెట్ అంతకు అంతకు పెరిగిపోతూ ఉంటుంది.

Samantha's first look from Shaakuntalam out

దీంతో ప్రొడ్యూసర్ పై తీవ్ర భారం పడుతుంది. సినిమా విడుదలై అనుకున్న రిజల్ట్ రాకపోతే ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిందే. అనుకున్న టైం కి విడుదలై అయితే ప్రొడ్యూసర్ కొంత సేఫ్ అవుతారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇకా సమంత అభిమానులు ఈ సినిమా సమంత కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. గుణశేఖర్ వ్యవహరిస్తున్న తీరుకు వీరంతా కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.

Share post:

Latest