రామ్ కోసం బాలయ్యను దింపుతున్న బోయపాటి.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ లో మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న‌ దర్శకుడు బోయపాటి శ్రీను. గత ఏడాది ‘అఖండ’ సినిమాతో బోయపాటి శ్రీను బాలకృష్ణకి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఇచ్చాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను హీరో రామ్ తో తన తర్వాత సినిమా ప్రకటించాడు. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చేస్తానని బోయపాటి అప్పుడే చెప్పాడు.

ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమాకు సంబంధించిన ఏటువంటి అప్డేట్ అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనె రామ్ క్యారెక్టర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త ఏమిటంటే.. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తుంది. ఒక రోల్ లో రామ్ లేడీస్ కాలేజీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. రెండో క్యారెక్టర్ లో రామ్ మునుపెన్నడు ఎప్పుడూ చూడని విధంగా రామ్‌ని బోయపాటి చూపించబోతున్నట్టు సిని వర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే బోయపాటి బాలకృష్ణతో సింహా సినిమాలో లెక్చరర్ రోల్ చేయించి బాలకృష్ణకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు అదే ఫార్ములా నీ రామ్ కోసం బోయపాటి వాడుతున్నాడు.

Ram and Boyapati Srinu New Movie Opening Video | #BoyapatiRAPO | Manastars  - YouTube

అయితే ఈ సినిమాను కూడా బోయపాటి తన మార్క్ పక్క యాక్షన్ మరియు ఎమోషనల్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు బోయపాటి రామ్ ఇమేజ్‌కు సూట్ అయ్యే కథను రెడీ చేశాడట. బోయపాటి గ‌త‌ సంవత్సరం అఖండతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో కూడా బోయపాటి రామ్ కి తన కెరియర్ లోనె బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు.

Share post:

Latest