రజిని.. మణిరత్నం కాంబినేషన్లో సినిమా లాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక డైరెక్టర్ మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో కేవలం ఒకే ఒక చిత్రం వచ్చింది అది కూడా దళపతి. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.కోలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ గా నిలిచిన ఈ చిత్రం పలు రికార్డులను కూడా నమోదు చేసింది. అయితే త్వరలోనే కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Superstar Rajinikanth and Mani Ratnam reuniting after 32 years? - Tamil  News - IndiaGlitz.com
రజినీకాంత్ ,మణిరత్నం ఇద్దరూ కూడా ఎవరి దారిన వారు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే కలిసి చేద్దామని ఏనాడు కూడా ప్రయత్నించలేదు. అయితే తాజాగా 30 ఏళ్ల తర్వాత మరొకసారి ఈ కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతుందని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ తో మనీ సార్ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు పలు సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరిని లైకా ప్రొడక్షన్ కలుపుబోతున్నట్లు సమాచారం. ఇటీవల లైకా సంస్థ రజినీకి రెండు సినిమాలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక చిత్రాన్ని శిబు చక్రవర్తి తెరకెక్కిస్తున్నారు. రెండవ సినిమా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

28 Years of Thalapathi: 12 rare working stills ft. Rajinikanth and Mani  Ratnam from the sets that yo- Cinema express

అందుకు ఆ స్థానంలో డైరెక్టర్ మణిరత్నం కి అవకాశం ఇచ్చారు లైకా సంస్థ తనతో కచ్చితంగా ఒక సినిమా చేయాలని కోరడం జరిగిందట.అందుకు మణిరత్నం కూడా వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. రజనీకాంత్ ఈ విషయం చెప్పగా కాస్త ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పాన్నియన్ సెల్వన్ మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని కూడా లైకా సంస్థ భారీ బడ్జెట్లోనే తెరకెక్కించారు. దీంతో వీరికి భారీ లాభాలు వచ్చాయని సమాచారం. ఇక మణిరత్నం రెండో భాగం పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజనీకాంత్ సినిమా విషయం మణిరత్నం వద్ద ప్రస్తావించడంతో ఆయన ఒప్పుకున్నట్లుగా సమాచారం.

Share post:

Latest