లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..అవతార్ 2 లో భారీ మార్పులు..!!

హాలీవుడ్ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అవతార్2 . అవతార్1 సినిమా గతంలో వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో విడుదలైన అవతార్ మొదటిభాగం అన్ని దేశాల్లో ఉన్న ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. ఈ సినిమా తర్వాత అలాంటి సినిమాలుకు మరింత క్రేజ్ పెరిగింది.

MOVIES: Avatar 2 - News Roundup *Updated 23rd July 2020*

మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధాన్ని అద్భుతంగా చూపించాడు జేమ్స్. ఈ సినిమాను 234 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగాా 2.924 బిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు అవతార్ పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అవతార్ సిరీస్లను ఏకంగా ఐదు భాగాలుగా తినున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ ఎప్పుడు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు అవతార్ పార్ట్ 2 కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కరలు కొడుతుంది.

Avatar 2 The Way Of Water Official Trailer 2022 James Cameron - YouTube

ఈ సినిమాను డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్ 2 రన్ టైం సైతం భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అవతార్ మొదటి భాగం రన్ టైం కేవలం రెండు గంటల 42 నిమిషాలు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు రెండో భాగం రన్ టైం మాత్రం మూడు గంటల 10 నిమిషాలు ఉండిబోతుందని సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది.. ఇంద లో ఎంతవరకు నిజమందో తెలియాలంటే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేంతవరకు ఆగాల్సిందే..!

Share post:

Latest