హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గాలమేస్తున్న జాన్వీ కపూర్… మరో అతిలోక సుందరిలాగా వుంది!

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్‌’ సినిమాతోనే మంచి నటిగాను, అందంతోను బి టౌన్ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసేసింది. అందంలో అమ్మకు తగిన కూతురు అని పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ బాలీవుడ్ బ్యూటీ అప్పుడప్పుడు ఫోటో షూట్‌లతో పాటు వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో కనబడటం వలన నిన్నటి తరం వారు కూడా ఆమె అందాన్ని స్క్రీన్ పైన తిలకిస్తున్నారు. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. అయితే సిల్వర్ స్క్రీన్‌పై అంతగా ఆకట్టుకోలేకపోతున్న జాన్వీ… సోషల్ మీడియాలో మాత్రం పొట్టి డ్రెస్సులతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది.

రోజు తప్పించి రోజు ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవుతూనే ఉండటం మనం గమనించవచ్చు. ఈ క్రమంలో తమ క్రియేటివ్ కాస్ట్యూమ్స్‌కి జాన్వీతో యాడ్స్ చేయించుకుంటూ… ఆమెను యూత్ స్టైల్ ఐకాన్‌గా మార్చేందుకు కొన్ని బ్రాండ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజగా మరోసారి అదరగొట్టారు జాన్వీ. తాజాగా కనబడుతున్న శారీలో హాట్ గా కనిపిస్తున్న లుక్‌లో జాన్వీ ఎంతో అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

Share post:

Latest