ఇందిరా దేవి తన ఆస్తులను కూతుర్లకే ఇవ్వడం వెనుక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే హీరోగా ప్రతి విషయంలో కూడా సరికొత్త ట్రెండు సృష్టించి సూపర్ స్టార్ గా కృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఈయన సినిమాలన్నీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సృష్టించేవి.. అయితే కృష్ణ సినిమాల్లోకి రాకముందే.. తన మేన కోడలు అయిన ఇందిరా దేవిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలతో ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఇందిరా దేవిని ఒప్పించి మరీ ఆమెను వివాహం చేసుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇక కృష్ణను ఎంతో ప్రేమగా చూసుకునేదట ఇందిరా దేవి. కానీ ఆమె కూడా ఇటీవల అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.

Mahesh Babu's mother Indira Devi passes away at 70

ఇకపోతే ఇందిరా దేవికి చాలానే ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ ఆస్తులు ఎవరికి వెళ్తాయి అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎక్కడైనా సరే తల్లిదండ్రుల ఆస్తులు మగ పిల్లలకు వెళ్తాయి మగ పిల్లలు లేకపోతే ఆడపిల్లలకు వెళ్తాయి కదా అని అందరూ అనుకోవచ్చు. ఇకపోతే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ ఆమె కోసం కొన్ని ఆస్తులను ఉంచగా, ఇందిరా దేవి కి ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె కోసం కొంచెం ఆస్తిని కూడా ఇచ్చారట. ఇక ప్రస్తుతం వారి పిల్లలకు ఏ లోటు లేకుండా అన్ని విధాల దగ్గరుండి చూసుకునేవారు ఇందిరాదేవి . అయితే తన తల్లి నుంచి వచ్చిన ఆస్తులను ఇందిరాదేవి తన కూతుర్లకు ఇచ్చేసారట.

కారణం తన వివాహ సమయంలో ఇందిరాదేవి కి తన తల్లి ఆస్తి ఇచ్చారు కాబట్టి ఆమె కూడా తన ఆస్థి తన కూతుర్లకు ఇవ్వాలని భావించిందట. అందుకే ఇందిరా దేవికి ఉన్న ఆస్తుల మొత్తం కూతుర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఇందిరా దేవి ఆస్తులు మహేష్ బాబు కాకుండా వారి అక్కచెల్లెళ్లకు వెళ్తున్నట్లు సమాచారం.

Share post:

Latest