దసరా సినిమా నుంచి .. ఫస్ట్ సింగిల్ అవుట్ నౌ..!!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం దసరా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది పక్కా తెలంగాణ నేపథ్యంలో బొగ్గు గనుల కార్మికుడిగా ఈ సినిమాలో హీరో నాని కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి రిలీవ్ చేసిన నాని మాసివ్ అవతారంలోకి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ధూమ్ ధామ్ దోస్తావ్ అనే సాంగ్ కూడా విడుదల చేశారు చిత్రబృందం.

Nani's Dasara first single to be out on Dussehra - Cinereporters

ఈ రోజున కొన్ని నిమిషాల ముందు ఈ లిరికల్ వీడియోను విడుదల చేయడం జరిగింది . సిల్క్ బార్ లో నేపథ్యంలో నానితోపాటు కొంతమంది పాల్గొన్నట్లుగా ఈ లిరికల్ లో చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ పాట కూడా పక్కా తెలంగాణ జానపద స్లాంగ్ లో తెరకెక్కించినట్లుగా ఈ వీడియోను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక ఈ పాటకు తగ్గట్టుగా నాని వేసిన డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ పాటని రాహుల్ సింప్లీ గంజితో పాటు పాలమూరు జంగి రెడ్డి నరసమ్మ తదితరులు అలరించారు.

ఈ పాటలో నాని కనిపించిన మాస్ లుక్ ఇప్పటికే ఈ సినిమా పైన భారీ అంచనాలను పెంచేస్తోంది.ప్రతి ఒక్కరు కూడా నాని లుక్కుని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రంలో సముద్రఖని సాయికుమార్ తదితరులు కీలకమైన పాత్రలు నటిస్తున్నారు ప్రస్తుతం ఈ పాట కాస్త వైరల్ గా మారుతోంది.

 

Share post:

Latest