నాగార్జున నటించిన సినిమా ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ విడుదల చేసే సినిమాలు చాలా ఎక్కువగా అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమాలను విడుదల చేసి పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సరికొత్త ట్రెండ్ కి మహేష్ బాబు పోకిరి చిత్రంతో మొదటిసారిగా తెర లేపగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి ,వంటి సినిమాలను చేశారు దీంతో అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబట్టాయి. అయితే త్వరలోనే ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

Watch Siva Full HD Movie Online on ZEE5

అయితే ఇదంతా ఇలా ఉండగా తాజాగా నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం శివ ఈ సినిమా అప్పట్లో చాలా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తిరిగి రీ రిలీజ్ విడుదల చేస్తున్నట్లు నాగార్జున కూడా తెలియజేశారు. అయితే ఈ సినిమాని థియేటర్లో కాకుండా డిజిటల్ మీడియాలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా నిర్మాతలు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కొన్ని మిస్ అయ్యాయని త్వరలో వాటిని సమకూర్చి ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నామని నాగార్జున తెలియజేశారు.

అయితే ఈ సినిమా 1990 డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్రం 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసిన వర్మ నాగార్జున తోనే ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాకి తనికెళ్ల భరణి స్కిప్ట్ కూడా రాయడం జరిగింది. వర్మ చదువుతున్న కాలేజీలోని స్నేహితుల పేర్లను ఈ సినిమాలో కొంతమందికి పెట్టారట. ఈ సినిమాతో వర్మ కెరియర్, సినీ ఇండస్ట్రీ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ మేకింగ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది.

Share post:

Latest