అత్తారింటికి దారేది సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో అత్తారింటికి దారేది సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తన స్టామినాని మరొకసారి నిరూపించారని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాతే పవన్ కళ్యాణ్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ అవ్వడంతో ఈ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుందని అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అయితే ఈ చిత్రం గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Attarintiki Daredi Telugu Movie Songs Lyrics. – Lyrics Basket
ఈ చిత్రంలో హంసానందిని ఐటెం సాంగ్లో నటించింది అయితే ఈ ఆఫర్ మొదట అనసూయకు వెళ్ళిందట కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో హంసానంది నికీ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కేవలం ఫోన్లోనే చెప్పారట. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Attarintiki Daredi (2013) - IMDb
ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా ఇలియానాని తీసుకుందామని కున్నారట. కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ లేకపోవడంతో సమంత హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రం మొదటి కొంత భాగాన్ని ఫారేన్ లో చిత్రీకరించారు. అయితే ఈ లొకేషన్ లను స్వయంగా పవన్ కళ్యాణ్ నే చూపించారట.

Attarintiki Daredi Movie: Where Is Pawan Kalyan's Aunt?
ఈ చిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే సన్నివేశాలకు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2013లో విడుదలై నాలుగు ఫిలింఫేర్ అవార్డులు ఆరు సైమ అవార్డులను సైతం దక్కించుకుంది. ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ కు అత్యధికంగా వ్యూస్ రాబట్టాయి. దీంతో సరికొత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సరికొత్త రికార్డులను కలెక్షన్ల పరంగా క్రియేట్ చేశారు. ఈ చిత్రం దాదాపుగా రూ.187 కోట్ల రూపాయలు రాబట్టింది.