జూనియర్ ఎన్టీఆర్ తల్లి చేసిన ఉద్యోగం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన తెరపై ఏ విధంగా కనిపిస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు చాలా ఎక్కువమంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాల విషయంలో భాగంగా బిజీగా ఉన్నారు..

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతి ఒక్కరికి ఎన్నో విషయాలు తెలుసు. కానీ ఆయన ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ వుంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి అయితే చాలామందికి తెలియదనే.. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా చాలా వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. నిజానికి సోషల్ మీడియాకి దూరంగా ఉండే షాలిని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు జనార్దన్ రావు ఆమె గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ మదర్ మా రిసెప్షన్లో ఈసీఎన్ లో రిసెప్షన్ గా పనిచేశారు అని జనార్దన్ రావు తెలిపారు.

అలాగే ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన తల్లి గురించి చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడారు జనార్దన్ రావు. ఇక ఎన్టీఆర్ తల్లి షాలిని హరికృష్ణ కి రెండవ భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే.

Share post:

Latest