ఆదిపురుష్ టీజర్ ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ ఓం రౌత్..!!

రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుక సందర్భంగా ఈ సినిమా టీజర్ ను గత ఆదివారం అయోధ్య వేదిక మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఆదిపురష్ చిత్ర బృందం. అయితే ఈ టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ టీజర్ లో VFX చాలా దారుణంగా ఉందని హాలీవుడ్ మూవీస్ సీన్స్ ని చాలా కాపీ కొట్టారని కార్టూన్ మూవీ లా ఉందని అభిమానులతో పాటు సినీ విమర్శకులు కూడా ఈ సినిమా పైన ట్రోల్ చేయడం జరుగుతోంది.

Netizens troll Prabhas and Saif Ali Khan starrer 'Adipurush' teaser for  poor VFX | Hindi Movie News - Times of India
తాజాగా ఈ ట్రైలర్ విమర్శలపై డైరెక్టర్ ఓం రౌత్ స్పందిస్తూ.. ఆది పురుష్ టీజర్ మొబైల్ లో చూసేందుకు చిత్రీకరించలేదని అది ఫోన్లో చూడలేనంత భారీ చిత్రమని పెద్ద స్క్రీన్ పైన ఈ సినిమా చాలా అద్భుతంగా కనిపిస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా ఆది పురష్ టీజర్ పై వస్తున్న ట్రోలింగ్ చూసి కాస్త ధైర్యం కోల్పోయాము అన్నమాట వాస్తవమే..అయితే ఈ ట్రోలింగ్ లకు నేనేమి పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుచేత అంటే ఈ సినిమా పెద్ద స్క్రీన్ కోసం మాత్రమే తీశాము .మొబైల్ ఫోన్లో చూడడానికి కొంత భిన్నంగానే ఉంటుంది అని.. అలాంటి వాటిని నేను నియంత్రించలేని వాతావరణం అని తెలిపారు.

Adipurush teaser: Disappointed fans troll makers for VFX; compare it to  cartoon network
థియేటర్లో తెరపైన సైజు తగ్గవచ్చు కానీ ఆ పరిమాణాన్ని మరి మొబైల్ తగ్గించకూడదు.తనకొక అవకాశం ఇస్తే యూట్యూబ్లో పెట్టకుండా నిరోధించగలనని అది కేవలం ఒక గంట పని మాత్రమే నాకు అని తెలియజేశారు. ఎంతోమంది అభిమానులను ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ లో టీజర్ ఉంచామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ అయిన టి సిరీస్ తనకి మంచి సన్నిహితమని తెలిపారు. అంతేకాకుండా అరుదుగా థియేటర్లో సినిమాలు చూసే వాళ్ళ కోసం ఈ సినిమా తీయలేదు. సీనియర్ సిటిజెన్లు మారుమూల గ్రామాలలో థియేటర్లో అందుబాటులో లేని వారు కూడా ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు రప్పించడమే మా ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఓం రౌత్.

Share post:

Latest