ఒకేసారి అన్ని కోట్లు ఖర్చుపెట్టి కారు కొన్న బిత్తిరి సత్తి..!!

బుల్లితెరపై పలు టీవీ కార్యక్రమాలలో కమెడియన్ గా ఎంతో గుర్తింపు సంపాదించారు బిత్తిరి సత్తి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలు చేస్తూ బాగానే సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా నటుడుగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉండగా హీరోగా కూడా ఆడప దడప్ప సినిమాలను నటిస్తూ ఉన్నాడు బిత్తిరి సత్తి. బిత్తిరి సత్తి మాటలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి. అందుచేతనే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా దసరా పండుగ సందర్భంగా బిత్తిరి సత్తి ఒక కొత్త కారు ను తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 బిత్తిరి సత్తి... టీవీలో కమెడియన్‌గా కెరియర్ ప్రారంభించి... ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసుకుంటూ పోతున్నాడు. సత్తితో చేసిన ఇంటర్వ్యూలు కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూలకు బిత్తిరి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా దసరా సందర్భంగా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. అంతేకాదు దానికి ఆయుధ పూజా కూడా నిర్వహించాడు. (Twitter/Photo)
బిత్తిరి సత్తి ముఖ్యంగా తీన్మార్ న్యూస్ తో మరింత పాపులర్ అయ్యారు. తాజాగా బిత్తిరి సత్తి రూ 4 కోట్ల రూపాయలకు పైగా ఉన్న రేంజ్ రోవర్ కారును కొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కారును కేవలం స్టార్ హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన స్టీరింగ్ తో పాటు ఆటోమేటిక్ గేర్ సిస్టం కూడా కలదు. అయితే ఈ కారు మాత్రం సెకండ్ హ్యాండ్ లో రూ. కోటి నుంచి కోటిన్నర ఉంటుంది సమాచారం.

Anchor Bithiri Sathi Profile Biography Family Photos, Wiki, Biodata, Body  Measurements, Age, Wife, Affairs

అయితే బిత్తిరి సత్తి కొత్త కారు కొన్నారా లేదంటే సెకండ్ హ్యాండిల్ కారు కొన్నారు అనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. బిత్తిరి సత్తి ఈ మధ్యకాలంలో బాగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నారు చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి స్టార్ హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ దీంతో యాంకర్ గా సుమ కంటే ఎక్కువగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో కూడా బిత్తిరి సత్తికి మంచి క్రేజ్ ఉంది అందుచేతనే భారీ స్థాయిలో ఆదరణ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి బిత్తిరి సత్తి కొన్న ఈ కారు పై వస్తున్న వార్తలు నిజమో కాదు తెలియాల్సి ఉంది.

Share post:

Latest