తూచ్..మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. నయన్-విగ్నేష్ సరోగసి వివాదంలో కొత్త ట్వీస్ట్..!?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార- డైరెక్టర్ విగ్నేష్ శివం సరోగసి ప్రాసెస్. మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీళ్ళు ..కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి టైంలో వీళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్ ఫొటోస్ ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనకు తెలిసిందే. కాగా పెళ్లి తర్వాత నయన్ విగ్నేశ్ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Nayanthara and Vignesh Shivan in Spain Photo: Instagram @wikkiofficial

అయితే అక్టోబర్ 9న విగ్నేష్ శివన్..” నయనతార నేను అమ్మ అప్ప అయ్యాము” అంటూ షాకింగ్ పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షేక్ అయింది . మీడియా షాక్ అయింది. దెబ్బకు జనాలు మైండ్ బ్లాక్ అయింది. పెళ్లై నాలుగు నెలలు కంప్లీట్ అయిన వెంటనే ఇద్దరు కవల పిల్లలు ఎలా పుట్టారు అంటూ అభిమానులు అయోమయ స్థితి లొ ఉండిపోయారు. అయితే ఇదంతా సరోగసి కారణంగానే అంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇక్కడ ఇంకొక ట్వీస్ట్ ఏంటంటే..ఇండియాలో సరోగసి బ్యాన్ అయింది . మరి నయనతార విగ్నేష్ ఈ ప్రాసెస్ ను ఎలా ఇంప్లిమెంట్ చేశారు . ఒకవేళ అది ఇల్లీగల్ అయితే మాత్రం నయనతార విగ్నేశ్ ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణన్ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.

కాగా రోజురోజుకీ నయనతార విగ్నేష్ శివన్ సరోగసి ప్రాసెస్ చిక్కుముడులు ఎక్కువ అయిపోతుండడంతో.. నయనతార విగ్నేశ్ శివన్ లు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తమకు ఆరేళ్ల ముందే పెళ్లయినట్టు డాక్యుమెంట్స్ ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించారట. అంతేకాదు నయనతారలో ఏదో లోపం ఉందని అందుకే వాళ్ళు సరోగసి చూస్ చేసుకున్నారని చెప్పుకొచ్చారట. నిజానికి సరోగసి ఫాలో అవ్వాలంటే పెళ్లి అయ్యి అయిదేళ్లు దాటాలి ..కచ్చితంగా అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఏదో ఒక్క లోపం ఉండాలి . అప్పుడే సరోగసిని ఇంప్లిమెంట్ చేయొచ్చు . ఈ కారణంగానే లాయర్లు ఇచ్చిన సలహాలతో నయనతార విగ్నేశ్ ఈ దొంగ పెళ్ళిని క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది . మరి చూడాలి తమిళనాడు ప్రభుత్వం ఈ దొంగ సర్టిఫికెట్లను నమ్ముతుందో లేదో..?