బాలకృష్ణ మొదటి కమర్షియల్ యాడ్ వీడియో వైరల్..!!

నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు టాక్ షోలు చేస్తూ బాలకృష్ణ తన హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక తాజాగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలకృష్ణ యాడ్స్ లో నటించబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే అందుకు సంబంధించి తాజాగా ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Balakrishna: బాలకృష్ణ సినీ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్.. ఈ రోజు బాలయ్య  ఫ్యాన్స్‌కు వెరీ వెరీ స్పెషల్.. | Balakrishna Nandamuri veera Simha Reddy  Fame First commercial Add Release ...

అయితే సాధారణంగా స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీల సైతం పలు సంస్థల యాడ్ కోసం క్యూ కడుతూ ఉంటారు. వాటిని క్యాష్ చేసుకోవాలని ఎంతోమంది పలు రకరకాల యాడ్ లలో నటిస్తూ ఉంటారు. ఇక అందుకోసం పెద్ద మొత్తంలో కూడా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం యాడ్స్ కి దూరంగా ఉంటూ ఉంటారు.అలాంటివారిలో బాలకృష్ణ కూడా ఉండేవారు. తాజాగా ఆయన అడ్వర్టైజింగ్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి ప్రియ గ్రూపుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు బాలకృష్ణ.

హీరో స్టైల్ లో 116 ఫార్మాట్ వెంచర్ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా బాలకృష్ణ ఈ మధ్యకాలంలో యువ హీరోలకు పోటీగా తన చిత్రాలను విడుదల చేయడమే కాకుండా ఇలా పలు యాడ్స్ లలో నటిస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నారని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి అనే సినిమాలో నటిస్తున్నది.