నిన్న విడుదలైన సినిమాలన్నీ ఓటీటి అప్డేట్ ఇవే..!!

నిన్నటి రోజున ప్రేక్షకుల ముందు థియేటర్ లో సినిమాలు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ బాబు నటించిన ఫస్ట్ చిత్రం స్వాతిముత్యం నిన్నటి రోజున విడుదలయ్యాయి. ఇక ఈ మూడు సినిమాలు కూడా దసరా పండుగ కానుకగా విడుదలవ్వడంతో మంచి ఓపెనింగ్ కూడా రాబట్టాయి. గాడ్ ఫాదర్ సినిమా పట్ల మెగా అభిమానులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా పాజిటవ్ టాక్ ను సొంతం చేసుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

GodFather The Ghost Swathi Muthyam USA Premieres Tonight: Political,  Action, Fun
ఇక ఈ మూడు చిత్రాలు ఓటీటి లో ఎప్పుడు విడుదలవుతాయనే విషయంపై.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. చాలామంది ఈ సినిమాలు పలు రకాల ఓటీటి లో విడుదలైతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఈ వార్తలు నిజమవుతున్నట్టుగా విడుదల సమయం లో టైటిల్ కార్డులో ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇక అంతే కాకుండా ఆహా ఓటీటి స్వాతిముత్యం సినిమాను తీసుకున్నట్లుగా సమాచారం.ఇక ఈ రెండు సినిమాల విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఇక మిగిలింది ది ఘోస్ట్ సినిమా. ఈ సినిమా ప్రముఖ ఓటీటి వారు ఈ సినిమాను మంచి ఆఫర్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఆ డీల్ పూర్తి కాలేదని టాక్ కూడా వినిపిస్తోంది.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా వెలుపడే అవకాశం ఉన్నది.

Share post:

Latest