జగన్ ఇచ్చిన పదవిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆలీ..!!

కమెడియన్ ఆలీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటివరకు కూడా పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు ఆలీ. ప్రస్తుత రాజకీయాలలో కూడా తన సత్తా చాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆలీ పలు ప్రాంతాలలో ప్రచారం చేయడం కూడా జరిగింది. వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం ఆలీ కూడా బాగానే కృషి చేశారని చెప్పవచ్చు.

YS Jagan Ali: ముఖ్యమంత్రి జగన్‌తో ప్రముఖ నటుడు అలీ భేటీ.. | Comedian Ali  met AP CM YS Jagan in his office and here the behind story pk– News18 Telugu
దీంతో కమెడియన్ ఆలీకి ఏదైనా పదవి వస్తుందని మూడేళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది తప్ప పదవి మాత్రం రాలేదని చెప్పవచ్చు. అయితే ఎట్టకేలకు తాజాగా ఆలీ అని తన ప్రభుత్వంలో చోటు కల్పించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలీని నియమించడం జరిగింది. ఇక ఆలీకి వేతనం కింద రూ.3 లక్షల రూపాయల వరకు వేతనం ఉంటుందట అదనంగా మరికొన్ని అలవెన్స్లు కూడా ఉండబోతున్నట్లు సమాచారం.

సీఎం జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం అలీ కీల‌క వ్యాఖ్య‌లు
కాగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా తనని నియమించినందుకు ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలీ. అయితే ఈ పదవి తన బాధ్యతగా స్వీకరించి ఫుల్ ఫీల్ చేస్తానని తెలియజేశారు. తన కూతురు పెళ్లి సందర్భంగా వైయస్ జగన్ ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నానని తెలిపారు.వైసిపి కండువా కప్పుకున్నప్పుడే నేను ఏపీ సీఎం గారికి నా ఉద్దేశం స్పష్టం చేశాను. పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయాన్ని ఆయనకు తెలుసు అయితే నా పదవికి సంబంధించి గతంలో మీడియాలు పలు రకాలుగా వార్తలు వినిపించాయి.దీనిపై కూడా నేనెప్పుడూ ఇస్తూనే ఉన్నానని తెలిపారు. ఇక ఈ పదవి నా కూతురు పెళ్లికి ఇచ్చిన జగన్ గిఫ్టుగా భావిస్తానని తెలిపారు అలీ.