యష్: వారికి రూ.50 కోట్ల విరాళంపై క్లారిటీ ఇదే..!

కేజీ ఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్. ముఖ్యంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో అమాంతం క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టడం జరిగింది ఇదంతా ఇలా ఉండగా సినీ ఇండస్ట్రీలో కోట్లలో పారితోషకం తీసుకొనే నటులలో హీరో యశ్ కూడా చేరిపోయారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రాఖీ భాయ్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అయోధ్యలో రామ మందిర పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇందుకోసం దేశంలోని కొన్ని లక్షల మంది విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోని రామ మందిర నిర్మాణానికి ఈ హీరో యష్ 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు ఒక వార్త అందర్నీ ఆశ్చర్యానికి కలిగేలా చేసింది.Yash: ಅಯೋಧ್ಯೆ ರಾಮ ಮಂದಿರಕ್ಕೆ ಯಶ್​ 50 ಕೋಟಿ ರೂ. ಕೊಟ್ರು ಅಂತ ಹಬ್ಬಿದೆ ಸುಳ್ಳು  ಸುದ್ದಿ; ಫೋಟೋ ಹಿಂದಿನ ಸತ್ಯವೇನು? | KGF 2 actor Yash did not donated Rs 50 Cr  to build Ram Mandir in Ayodhya ...అయితే ఇటీవల ఆయన రామ మందిరాన్ని దర్శించుకున్నట్లుగా ఈ సందర్భంగా ఆ విరాళాన్ని ప్రకటించినట్లు నెట్టింట్లో ఒక పోస్టు వైరల్ గా మారుతున్నది అయితే ఈ పోస్టులో మాత్రం ఎలాంటి నిజం లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇక హీరో యష్ ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉన్నారు. కర్ణాటకలోని పలు సరస్సులకు, పరిరక్షణకు ,భూగర్భ జలాల పెంపుదల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు ఇక ఈయన స్థాపించిన సంస్థ యశోమార్గ ద్వారా ఎంతో మందికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.Social Media Postఅయితే రామ మందిరం విరాళం పై వస్తున్న వార్తలలో మాత్రం ఎలాంటి నిజం లేదని.. విరాళం ఇస్తానని ప్రకటించిన ప్రకటన అవాస్తవమని కొంతమంది క్రిటిక్స్ తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.అయితే అది అయోధ్య సందర్భంలోని ఫోటో కాదని.. కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా విడుదల సమయంలో తిరుపతిలో దిగిన ఫోటో అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈ విషయం అంత ఒక ఫేక్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ విషయంపై హీరో యష్ స్పందిస్తే బాగుంటుంది.

Share post:

Latest