కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న హీరోయిన్ మాళవిక… బ్లాక్ టాప్‌లో చిచ్చురేపుతోంది!

హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి కుర్రకారుకి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం తమిళ, మలయాళీ, తెలుగు సినిమాలలో నటిస్తూ మంచి బిజీగా ఉంది. ఆమె సినిమాలతో ఎంత బిజీగా వున్నా, ఖాళీ సమయం చిక్కినపుడు సోషల్ మీడియాకి అతుక్కుపోతుంది. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన కొన్ని హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటోంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు కూడా ఆమె ప్రాధాన్యత ఇస్తోంది. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు. ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మాళవిక మిగతా సౌత్ అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ ముందుకు పోతున్నారు.

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో సెటిల్ అయిన తన తల్లిదండ్రులకు జన్మించింది. రజనీకాంత్ హీరోగా రూపొందిన పెట్టా సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఈ సినిమా పేట పేరుతో తెలుగులో విడుదల కాగా ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తండ్రి స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది.