అలాంటి నిర్ణయంతో ఎన్టీఆర్ కు కొన్ని కోట్లు నష్టం..!

డైరెక్టర్ కొరటాల శివ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించాల్సిన మూవీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది ఆ తర్వాత ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత ఆమె కూడా నటించక పోవడంతో ఎన్టీఆర్ 30వ సినిమాకు చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఇక RRR సినిమాలో నటించిన వారంతా ఎక్కువగా ఇతర ప్రాజెక్టులతో యాడ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం షూటింగ్లకు దూరంగా ఉంటూ అభిమానులకు చాలా నిరుత్సాహానికి గురి చేస్తున్నారు.

Fury of #NTR30 - Telugu | NTR | Koratala Siva | Anirudh Ravichander -  YouTube

దీంతో పలువురు అభిమానుల సైతం ఎన్టీఆర్ ఏడాదికి 60 కోట్ల రూపాయల వరకు నష్టపోయారని కామెంట్లు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గి చాలా యంగ్ గా మారారు. అయితే మరింత బరువు తగ్గిన తరువాతే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరైన ప్రాజెక్టులను ఎంచుకుంటూ ఎవరు ఊహించని స్థాయిలో సక్సెస్ను అందించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ కొత్త తరహా కథాంశంతో ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.Jr NTR and Koratala Siva's NTR30 delayed due to Acharya's failure? - Movies  News

ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మరింత అంచనాలను పెంచే విధంగా కనిపిస్తూ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ను సొంతం చేసుకుంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. ఎంతమంది సినీ హీరోలకు సైతం బ్లాక్ బాస్టర్ విజయాలను అందించిన కొరటాల శివ ఎన్టీఆర్ కు ఈ సినిమాతో మరింత క్రేజీను సంపాదిస్తాడని నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు. కానీ అభిమానులకు మాత్రం ఎన్టీఆర్ కు సంబంధించి సినిమా షూటింగ్ డేట్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Share post:

Latest