బండ్ల గణేష్ ఆ ఎన్నికలలో విజయం సాధించేనా..?

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్గా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఇక తర్వాత నటుడుగానే కాకుండా నిర్మాతగా హీరోగా కూడా వాళ్ళ సినిమాలలో నటించారు. ఇక బండ్ల గణేష్ ట్విట్టర్లో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బండ్ల గణేష్ ట్విట్టర్ కు 1.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అయితే తను ఎన్నికలలో పోటీ చేస్తానని ఓటు వేసి తనని గెలిపించాలని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

Don't drag me into politics: Actor-producer Bandla Ganesh | Telugu Movie  News - Times of India

అయితే గతంలో బండ్ల గణేష్ పార్టీ తరఫున నిలబడి ప్రచారం చేయడం కూడా జరిగింది. అయితే ఆ పార్టీ నుండి గెలవకపోవడం జరిగింది. 2018 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ ను పెంచిన బండ్ల గణేష్ ఆ తర్వాత తను చేసిన వ్యాఖ్యల విషయంలో కాస్త వెనక్కు తగ్గారని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు బండ్ల గణేష్ మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారా.. ఏ ఎన్నికలు అంటూ అభిమానులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది రాజకీయ ఎన్నికలు మాత్రం కాదన్నట్లుగా తెలుస్తోంది.

బండ్ల గణేష్ ఎన్నికల్లో నిలబడబోతున్నారా నాకే ఓటు వెయ్యండంటూ కామెంట్స్

త్వరలోనే హైదరాబాదులో FNCC ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలలో బండ్ల గణేష్ వైస్ ప్రెసిడెంట్ గా పదవికి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది మీ చేతులలో మార్చే శక్తి ఛాన్స్ ఉందని మీ అమూల్యమైన ఓటును తనకి వేసి గెలిపించాలని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బండ్ల గణేష్ ఎన్నికలలో విజయం సాధిస్తారో లేదో చూడాలి మరి. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ప్రస్తుతం ఉన్నారు. దీంతో బండ్ల గణేష్ పై కొంతమంది నెటిజన్లు ఎన్నికలలో గెలిస్తే మాకేం చేస్తావని కామెంట్ చేస్తూ ఉన్నారు.

Share post:

Latest