అదేంటి… ఎలా వున్న హీరోయిన్ ఇలా అయిపోయింది?

బేసిగ్గా సినిమా తారలు తన ఫిగర్ పైన యెంత ద్రుష్టి సారిస్తారో తెలియంది కాదు. దాదాపు హీరోయిన్లు అందరూ తమ శరీరాన్ని అదుపులోనే ఉంచుకుంటారు. ఏమాత్రం బరువు పెరిగినా కూడా ఇంకో గంట సేపు ఎక్కువగా వ్యాయామం చేస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వారికి మినహాయింపు అనుకోవాలి. అయితే యెంత బొద్దుగున్న ఆమె ముద్దుగానే కనబడుతుంది. ఆమె మరెవ్వరో కాదు, నివేదా థామస్. అవును, చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నేటి కాలం యువతకు క్రష్ గా మారిపోయింది. మొదటిసారి నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా 2016లో ఇండస్ట్రీకి పరిచయమైన నివేద తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది.

యాక్టింగా పరంగా చూసుకుంటే, టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్ల కంటే ఈమె బెటర్. కేవలం పాత్ర ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ మరింత గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అంతే కాదు రజినీకాంత్ కి కూతురు పాత్రలో కూడా నటించి మెప్పించింది. చాలా సెలెక్టివ్ గా చేసుకుంటూ వెళ్లడం వలన ఈమె కెరీర్ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే వున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక తెలుగు చిత్రం మరొక మలయాళం చిత్రం మాత్రమే ఉన్నాయి. ఇక తాజాగా రెజీనా తో కలిసి ఈమె నటించిన శాకిని డాకిని సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉందనే విషయం విదితమే.

ఇకపోతే తాజాగా ఓ సోషల్ మీడియా వేదికగా ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకటి రిలీజ్ అయింది. దాన్ని చూసిన నెట్టింట్లో జనాలు కాస్త అవాక్కవుతున్నారు. ఈ వీడియోలో తన తమ్ముడితో కలిసి డాన్స్ చేస్తూ ఉన్న నివేదాను చూసి ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సన్నగా కనిపించిన నివేద ఈ వీడియోలో చాలా లావుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొరియన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన శాకినీ ఢాకిని సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందని టాక్ నడుస్తోంది.

Share post:

Latest