నాగ‌చైత‌న్య – బాల‌య్య చిన్న కూతురు పెళ్లికి అడ్డు ప‌డింది ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని కుటుంబాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత నటరత్న ఎన్టీఆర్, దివంగత నట సామ్రాట్ ఏఎన్నార్ ఈ రెండు కుటుంబాలకు బలమైన పునాది వేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి, అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఈ రెండు కుటుంబాల నుంచి వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

 

ప్రస్తుతం వీరిద్దరూ సీనియర్ హీరోలుగా ఉంటూ తెలుగు సినిమా పరిశ్రమలో ఈ తరం జనరేషన్ హీరోలకు దిక్సూచిలా ఉన్నారు. ఇక ఇద్దరి తర్వాత నందమూరి, అక్కినేని ఫ్యామిలీల‌ నుంచి మూడోతరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగార్జున ఇద్దరు తనయులు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరో కానున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య – నాగార్జున ఇద్దరూ వియ్యంకుళ్లు అయ్యే అవకాశం వచ్చిందట. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినిని నాగార్జున కుమారుడు నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని బాలయ్య, నాగార్జున ఇద్దరు అనుకున్నారట.

వీరిద్దరూ నిర్ణయం తీసుకున్నాక నాగచైతన్య తాను సమంతను ప్రేమించిన విషయాన్ని నాగార్జునకు చెప్పారట. దీంతో నాగచైతన్యతో బాలయ్య రెండో కుమార్తె వివాహం జరగలేదు. ఆ తర్వాత నాగచైతన్య, సమంత ప్రేమించి నాలుగేళ్ల పాటు కాపురం చేసుకున్నాక గత ఏడాది చివర్లో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఒకవేళ నాగచైతన్య – తేజస్విని వివాహం జరిగి ఉంటే నందమూరి – అక్కినేని కుటుంబాల మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి ఉండేది

Share post:

Latest