మహేష్ మాటల్లో తన తల్లి గురించి ఏం చెప్పారంటే..?

ఈరోజున మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి మరణ వార్తతో అటు సినీ ఇండస్ట్రీని ఇటు అభిమానులలో తీవ్రమైన విషాదాన్ని నింపింది.. ఇక కృష్ణ భార్య మహేష్ తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఇందిరాదేవి ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూసినట్టుగా సమాచారం. ఇక మహేష్ బాబు తన అమ్మ అంటే ఎనలేని మమకారం.. అలా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు మహేష్ బాబు.

Mahesh Babu's mother Indira Devi passes away in Hyderabad | PINKVILLA
ఇక ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా, అలాగే మదర్స్ డే రోజున, ఉమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను షేర్ చేస్తూ తనకు తన తల్లి పట్ల ఉన్న మమకారాన్ని ఇలా పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే తన అన్న రమేష్ బాబు కూడా గత కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఇక రమేష్ బాబు కూడా పలు అనారోగ్యం సమస్యలతో మరణించడం జరిగింది.ఈ విషయం మహేష్ బాబును చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మహేశ్ కు కరోనా రావడంతో కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది మహేష్ బాబు.

ఇక ఇప్పుడు తన తల్లి మరణంతో మరింత కృంగిపోయారు తాజాగా మహేష్ బాబు తన తల్లి గురించి చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. ఈ వీడియో పై పలు రకాలుగా పలువురు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

https://twitter.com/maheshvamsi9/status/1574960234749394944?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574960234749394944%7Ctwgr%5E909f056c0bbff307c51327f9ac1baf6ece2ed865%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fan-old-video-of-mahesh-babus-emotional-words-about-his-mother-indira-devi-resurfaces-again-after-her-death-au51-791263.html