రజిని స్టార్ట్…పేటలో పొజిషన్ ఏంటో?

నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…ప్రజలకు సేవ చేయాలసిన ప్రజా ప్రతినిధులు..పూర్తిగా ప్రత్యర్ధులని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు…అసలు మంత్రులు అంటే తమ తమ శాఖలకు సంబంధించి బాధ్యతలని సక్రమంగా నిర్వహించి…ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రులు అర్ధం మారిపోయింది…కేవలం ప్రతిపక్ష పార్టీలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది…ఇప్పుడు జగన్ హయాంలో అంతకుమించి జరుగుతుంది.

రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు…కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియడం లేదు…ఇంకో విషయం ఏంటంటే..కొందరు మంత్రులు అని తెలుస్తున్నారు గాని…ఏ శాఖకు సంబంధించి మంత్రులు అనేది తెలియడం లేదు. ఎందుకంటే మంత్రులు అనేవారు వారి వారి శాఖలకు సంబంధించిన పనుల గురించి ప్రజలకు చెప్పడం కంటే…చంద్రబాబుని లేదా పవన్‌ని తిట్టడానికి ఉంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టడం..బాబు-పవన్‌పై విమర్శలు చేస్తున్నారు.

ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేస్తే వాటికి కౌంటర్లు ఇవ్వాలి..కానీ మంత్రులు కౌంటర్లు కంటే…పర్సనల్‌గా తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ మధ్య జగన్…ప్రతిపక్షాలని సరిగ్గా తిట్టడం లేదని క్లాస్ ఇచ్చారు..అలాగే మంత్రి పదవి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రులు ఒక్కసారిగా చంద్రబాబుపై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. ఇక ప్రతిపక్షంపై అనుకున్న స్థాయిలో విమర్శలు చేయని మంత్రి విడదల రజిని సైతం…తాజాగా అమరావతి రైతుల పాదయాత్రపై విరుచుకుపడ్డారు.

బాబు ఈ వయసులో పాదయాత్ర చేయలేరు కాబట్టి..రైతులతో చేయిస్తున్నారని, మూడు రాజధానులు ప్రజాప్రయోజనాల కోసమే తప్ప.. చంద్రబాబులా స్వప్రయోజనాలకు కాదని, రాజధానిలో ఏముంది? నాలుగు భవనాలు కట్టేస్తే..అదే రాజధానా?అని రజిని ప్రశ్నిస్తున్నారు. ఇక రజినికి టీడీపీ శ్రేణుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి…ఈ వయసులో కూడా బాబు యాక్టివ్ గా నడవగలరు..తిరగలరని, అలాగే ఎవరు నిత్య యవ్వనం ఉండరని, అందరికీ వయసు అవుతుందని కౌంటర్ ఇస్తున్నారు. అలాగే అమరావతికి దగ్గర ఉన్న చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రజినికి..మూడు రాజధానుల వల్ల ప్రయోజనం ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని అంటున్నారు.

Share post:

Latest