ఆ నటి చేతిలో చావు దెబ్బలు తిన్న వేణుమాధవ్.. కారణం..?

సినీ ఇండస్ట్రీలో రావాలని ఎంతోమంది అనుకొని సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన వారు చాలామంది ఉన్నారు.అలా ఎంతోమంది నటులుగా, టెక్నీషియన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి కూడా ఒకరు. చదువుకునే సమయంలోనే వివాహం చేశారు ఇమే తల్లిదండ్రులు. ఈమె సినిమాలలోకి రావడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కానీ వివాహమైన తర్వాత తన భర్త సపోర్టుతో జయావాణి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా మొదట్లో పలు సీరియల్స్ లో నటించి.. నెమ్మదిగా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

Popular Telugu comedian Venu Madhav passes away in Hyderabad | The News  Minute
అలా ఈమె నటించిన సినిమాలలో విక్రమార్కుడు, మహాత్మా ,యమదొంగ తదితర వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఈమె ఎక్కువగా గయ్యాళి క్యారెక్టర్లలో నటిస్తూ ఉండేది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా జయవాణి.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తను క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాను అంటే అందులో నుంచి అంత త్వరగా బయటికి రాలేనని తెలియజేసింది.అలా ఒకసారి చెలరేగిపోయానని.. దాంతో డైరెక్టర్ చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకొస్తుంది ఈమె.

jayavani, Actress Jayavani: గుర్తింపు కోసం ఆ సినిమాలు చేశా.. ఫొటోలు తీసి  ఇంటర్‌నెట్‌లో పెట్టారు: నటి జయవాణి - actress jayavani interesting comments  about her film career - Samayam Telugu
గతంలో ఒకసారి క్యారెక్టర్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కమెడియన్ వేణుమాధవ్ ని తన్నడం కూడా జరిగింది అని తెలిపింది. అదిరిందయ్యా చంద్రం సినిమాలో వేణుమాధవ్ రోడ్డు మీద తాగి పడిపోతూ ఉండే సన్నివేశం ఉన్నది. అతడిని లేపి ఇంటికి తీసుకువెళ్లే సన్నివేశాన్ని దర్శకుడు రిహార్సల్ చేసి చూపించారట. ఆ సన్నివేశం లో కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. తీరా కెమెరా ఆన్ చేసి యాక్షన్ అని చెప్పగానే క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ని కాలితో తన్నుకుంటూ తీసుకువెళ్లాను.. అలా షాట్ ఓకే అయిపోయింది. కానీ డైరెక్టర్ వచ్చి సీన్లో తన్నే సీన్ లేదు కదా ఎందుకు చేసావని.. తిట్టాడట. ఒకవేళ వేణుమాధవ్ వెళ్ళిపోతే తన పరిస్థితి ఏమిటి అని డైరెక్టర్ చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. కానీ వేణుమాధవ్ మాత్రం ఈ సన్నివేశం బాగా చేశావని చెప్పడంతో అందరూ అక్కడ కూల్ అయ్యారని తెలిపింది జయవాణి.

Share post:

Latest