వరలక్ష్మి శరత్ కుమార్ కు తీరని కోరిక ఇదేనట..!!

టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఈమె నటించిన సినిమాలలో ఎక్కువగా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. ఎక్కువగా ఈమె నెగటివ్ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా చేసినా అంతగా సక్సెస్ కాలేక పోయింది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎలాంటి పాత్రలోనైనా నటిస్తూ తన నటనకి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar: Varalakshmi is a typical actress who has completely  relocated to Hyderabad .. Is that the reason ..? | Actress Varalaxmi  Sarathkumar to move to Hyderabad - filmyzoo - Hindisip

ప్రస్తుతం యశోద సినిమాతో పాటు బాలకృష్ణ సినిమాలో కూడా నటిస్తున్నది. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత తనకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని ఆమె భావిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ తనకు హాస్య భరిత కథా చిత్రంలో నటించాలని చిరకాల కోరిక ఉన్నదని తెలియజేసింది. అయితే నాకు కామెడీ రోల్స్ లో నటించే అవకాశాలు అసలు రాలేదని ఆమె తెలియజేసింది. నాకు ఎక్కువగా విలన్స్ పాత్రలోనే నటించే అవకాశం వస్తున్నాయని తెలియజేస్తున్నది. ఎవరైనా కామెడీ కథ చిత్రాలలో నటించే అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఆమె భావిస్తున్నట్లుగా తెలిపింది.

ఇక అంతే కాకుండా తను ఒక డాన్సర్ ను కూడా అని తెలియజేసింది. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలను ఎంచుకకునే దిశగా అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు డైరెక్టర్ల సైతం ఆమెకు కామెడీ రోల్స్ ను ఆఫర్ చేసి ఆమె కోరికని తీరిస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. వరలక్ష్మి కెరియర్ పరంగా బాగానే సక్సెస్ అవడంతో ఆమె అభిమానులు కూడా టాలీవుడ్ లో మరింత పెరిగిపోయారు. ఎంతోమంది నటులతో పోలిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా తక్కువగానే ఉందని సమాచారం.

Share post:

Latest