బాబు క్లారిటీ..కానీ ఉండిలో డౌట్.!

సిట్టింగులకే సీట్లు అని చంద్రబాబు చెప్పడానికి చెప్పేశారు గాని..ఇప్పటికీ కొన్ని సిట్టింగ్ సీట్లలో కన్యూజన్ ఉంది. ఆ సీట్లని మళ్ళీ సిట్టింగులకే సీటు ఇస్తారా అనేది తెలియడం లేదు. సిట్టింగ్ సీట్లలో కన్ఫ్యూజన్ ఉన్నది ఉండి సీటులోనే. ఎందుకంటే ఈ సీటులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఉండి టీడీపీ కంచుకోట. 1983 నుంచి కేవలం ఒకసారి మాత్రమే ఓడింది.

అలాగే ఈ సీటు వేటుకూరి శివరామరాజుది..2009, 2014 ఎన్నికల్లో ఆయనే ఉండి నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిన రఘురామకృష్ణంరాజు వైసీపీలోకి వెళ్ళి పోటీకి దిగారు. దీంతో బాబు..సడన్‌గా శివరామరాజుని నరసాపురం ఎంపీగా పోటీ చేయించారు. ఇటు ఉండిలో శివ సోదరడు వరుసయ్యే మంతెన రామరాజుని బరిలో పెట్టారు.  ఎన్నికల్లో శివ ఓడిపోగా, రామరాజు గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉండి సీటుకు మళ్ళీ శివ వచ్చేస్తారని ప్రచారం ఉంది. కానీ బాబు ఏమో సిట్టింగులకు సీటు అన్నారు. దీంతో ఉండి రామరాజుకు ఇస్తే..శివ పొజిషన్ ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది.

ఎందుకంటే శివకు మళ్ళీ నర్సాపురం ఎంపీ సీటు ఇవ్వడానికి ఛాన్స్ కనబడటం లేదు. టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఆ సీటు జనసేనకు దక్కేలా ఉంది. ఒకవేళ టీడీపీకి దక్కినా సరే..వైసీపీ రెబల్ గా ఉన్న రఘురామ పోటీ చేసే ఛాన్స్ ఉంది. దీంతో శివకు ఏ సీటు ఫిక్స్ చేస్తారో క్లారిటీ లేదు. అదే సమయంలో రఘురామ కాకినాడలో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది.

అదే జరిగితే నరసాపురంలో శివ పోటీ చేయొచ్చు. కానీ పొత్తు ఉంటే జనసేనకు నర్సాపురం ఎంపీ సీటు వస్తే అప్పుడు పరిస్తితి ఏంటి అనేది తెలియదు. ఇవేమీ లేకుండా మళ్ళీ ఉండి సీటు శివకు ఇస్తే..రామరాజుకు సీటు ఉండదు. మొత్తానికి ఉండి సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు.