ఉదయభాను కెరీర్ నాశనమైంది అతడి వల్లేనా?

ఒకప్పుడు తెలుగులో యాంకర్ అనగానే గుర్తకొచ్చే పేరు ఉదయభాను..సినిమా తారలకు ఏమాత్రం తీసపోని అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పే రేంజ్ కి వెళ్లింది.. ఇప్పుడు తెలుగు యాంకర్లలో సుమ, అనసూయ, రష్మి హవా కొనసాగుతోంది. కానీ అప్పట్లో ఉదయభాను టాప్ యాంకర్ గా రాణించింది. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకునేది.. ఏకంగా హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకునేది.

అప్పట్లో ఏ ఈవెంట్ జరిగినా అందులో యాంకర్ గా ఉదయభాను కనిపించేది.. యాంకర్ గానే కాదు.. అడపా దడపా సినిమాల్లోనూ నటించింది. ఆమె కెరీర్ జోరు మీద ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.. ఆమె పెళ్లి ఒక మిస్టరీగా ప్రజల్లో మిగిలిపోయింది. ఇప్పటికీ దీని గురించి చర్చలు జరుగుతునే ఉంటాయి..

ఉదయభానుకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఓ ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అతడి నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించింది. కెరీర్ జోరు మీద ఉన్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. దీనిపై జనాలు పలు రకాలుగా చర్చించుకునేవారు. విజయ్ కుమార్ ఆమె వద్ద డ్రైవర్ అని.. కాదు..కాదు.. ఆమె ఆఫీస్ లో పనిచేసేవాడని రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే అతడితో పెళ్లి విషయంలో తల్లితో ఉదయభాను గొడవపడింది.

అప్పటి నుంచి ఉదయభాను కెరీర్ కాస్త గందరగోళానికి గురైందని టాక్.. ప్రేమ కారణంగానే బుల్లితెరపై ఆమె హవా తగ్గిందని చెబుతుంటారు. ఆ సమయంలో ఉదయభాను తీసుకున్న నిర్ణయం సరైనదే కానీ..తల్లితో గొడవ వల్లే ఆమె కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏదీ ఏమైనా బుల్లితెరపై ఉదయభాను క్రేజ్ వేరు.. ఇప్పటికీ కూడా ఆమె బుల్లితెరపై వస్తే ఒక జోష్ కనిపిస్తుంది.. ప్రస్తుతానికి ఇద్దరు పిల్లలతో ఉదయభాను మరియు విజయ్ కుమార్ సంతోషంగా ఉన్నారు. అప్పుడప్పుడు పిల్లలకు సంబంధించిన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటారు.

Share post:

Latest