AR రెహమాన్ పని అయిపోయిందా? ఎందుకిలా చేస్తున్నాడు అంటూ ట్రోల్స్?

AR రెహమాన్.. పరిచయం అక్కర్లేని పేరు. యావత్ ప్రపంచంలోనే పేరు గాంచిన ప్రఖ్యాత భారతీయ సంగీత దర్శకుడు ఆయన. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఏకైక భారత సంగీత సంగీత దర్శకుడు AR రెహమాన్. ఇకపోతే ఆయన గతం అద్భుతంగా వున్నా, వర్తమానం మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు జనాలు తన పాటల కోసం ఎంత గానో ఎదురుచూసే వారు. కానీ ఈ మధ్య కాలంలో రెహమాన్ నుండి వచ్చిన పాటలు ఆయన ప్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఈ మధ్య కాలంలో AR రెహమాన్ చేసిన ఏ ఒక్క మ్యూజిక్ ఆల్బం కూడా అద్భుతం అని ఎవరూ ఇక్కడ ఫీల్ అవ్వటం లేదు.

తాజాగా ఆయన చేసిన ‘పొన్నియన్ సెల్వన్’ ఆల్బం లోని పాటలు కూడా పెద్దగా సంగీత అభిమానులను ఆకట్టుకోలేదు. తాజాగా వచ్చిన ‘సై’ పాట ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ స్థాయిలో లేదు అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పాటను రహమాన్ ట్యూన్ చేశాడు అంటే నమ్మశక్యంగా లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. సై పాట ఒక్కటే కాదు ఆయన నుండి వచ్చిన పొన్నియన్ సెల్వన్ పాటలు అన్ని కూడా ఇదే పరిస్థితి.

ఇక పొన్నియన్ సెల్వన్ మాత్రమే కాకుండా సౌత్ లో ఈ మధ్య కాలంలో రెహమాన్ సంగీతం అందించిన ప్రతి పాట బాగాలేదని విమర్శలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు రెహమాన్ పాటలు అంటే మినిమం ఉంటాయి అనే అభిప్రాయం ఉండేది. దేశ వ్యాప్తంగా ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాటలను అందించిన రహమాన్ ఇప్పుడు మాత్రం అభిమానుల నమ్మకంను మెల్లమెల్లగా కోల్పోతున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్ మళ్లీ ట్రాక్ లొకి వచ్చి మళ్లీ తన ఒరిజినల్ సంగీతం అందించాలని ఆయన ప్యాన్స్ కోరుతున్నారు.