హీరో నాగార్జున కొరివితో తల గోక్కున్నారా? ఎందుకీ విమర్శలు వస్తున్నాయి?

హీరో నాగార్జునపై తాజాగా పలు ఆరోపణలు చేసారు CPI జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ. సీపీఐ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ గురించి అందరికీ తెలిసినదే. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డంలో నారాయ‌ణ త‌ర్వాతే ఎవ‌రైనా! మ‌రే నాయ‌కుడైనా ఇట్లా మాట్లాడితే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ క‌మ్యూనిస్టు పార్టీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నారాయ‌ణ ఇలా మాట్లాడటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నారాయ‌ణ తాజాగా హీరో నాగార్జున విషయంలో నిప్పులు చెరిగారు.

గతంలో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ బిగ్‌బాస్ షో విషయం పలు విమర్శలు చేసిన సంగతి తెలిసినదే. అయితే ఓ రెండు మూడు రోజుల కెరటం కూడా అదే విషయాన్నీ మరలా ప్రస్తావించడం కొసమెరుపు. ఈ క్రమంలో ఆ షోని బ్రోత‌ల్ హౌస్‌గా అభివ‌ర్ణించ‌డం ఇపుడు చాలామంది సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రమంలో నారాయ‌ణ ఆ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునపై కూడా పలు విమర్శలు చేసారు. దీంతో నారాయ‌ణ‌కు కౌంట‌ర్ అన్న‌ట్టు…. వీకెండ్ షోలో నాగార్జున సినిమాటిక్‌గా పంచ్ విసిరారు.

విషయంలోకి వెళితే, హౌస్‌లోకి కంటెస్టెంట్ల‌గా వెళ్లిన రోహిత్‌-మెరీనా జంట‌ను హ‌గ్ చేసుకోవాల‌ని సూచిస్తాడు. త‌న‌తో స‌న్నిహితంగా రోహిత్ మెల‌గ‌లేద‌నే ఆవేద‌న‌తో ఉన్న మెరీనాకు ఊర‌ట క‌లిగిస్తారు. ఇద్ద‌రికీ లైసెన్స్ వుంద‌ని, బిగువైన కౌగిలింత చేసుకోవాల‌ని సూచిస్తాడు. ఆ జంట కౌగిలింత‌లో ఉండ‌గా… “నారాయ‌ణ నారాయ‌ణ వాళ్లిద్ద‌రూ మ్యారీడ్” అంటూ నాగార్జున కౌంట‌ర్ ఇస్తారు. వాళ్లిద్ద‌రూ జంట కాబ‌ట్టి హ‌గ్ చేసుకోవ‌డంలో త‌ప్పు లేద‌ని నాగార్జున ఉద్దేశం. మ‌రి మిగిలిన వాళ్ల సంగతేంట‌ని? నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే ప్ర‌శ్న నారాయ‌ణ సంధించే కూడా లేకపోలేదు.

Share post:

Latest