ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న నాగర్జున..!!

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.. ఇప్పటివరకు ది ఘోస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేయగా ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

The Ghost movie: Vegam song arriving | cinejosh.com
ది ఘోస్ట్ సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ కథతో ఫ్యామిలీ ఎమోషనల్ కూడా ఉన్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సినిమా మొత్తం అండర్ వరల్డ్ కో ఆపరేషన్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక తన అక్క మేనకోడల్ని ఎలా కాపాడుకుంటాడో అని కథ అంశంతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున మరొకసారి యాక్షన్ తో అదరగొట్టారని ఈ ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఇక హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ ఈ సినిమాకి హైలైట్ గా కనిపించనుంది.

The Ghost Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

ఇక ఈ చిత్రంలోని డైలాగులు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు సక్సెస్ సంతోషం కంటె శత్రువులనే ఎక్కువగా సంపాదిస్తుంది.. అనే డైలాగులతో డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మరీ చిత్రంతో నైనా నాగార్జున సోనాలి చౌహాన్ కెరియర్ మారుస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest