ఊరి పేరే సినిమా పేరుగా వ‌చ్చిన సినిమాలు ఇవే… ఎన్ని హిట్‌… ఎన్ని ఫ‌ట్‌…!

ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా ఆ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఉండాలి. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గ‌ర నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా చాలా మంది హీరోలు ఊరి పేర్ల‌నే సినిమా పేర్లుగా పెట్టుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో ఎన్ని హిట్ ? ఎన్ని ఫ‌ట్ అయ్యాయో చూద్దాం.

1- హనుమాన్ జంక్షన్:
ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ అనే ఊరు ఉంది. ఆ ఊరు పేరు చాలా ఫేమస్. ఇదే పేరుతో జగపతిబాబు, అర్జున్ ,వేణులు హీరోలుగా నటించిన సినిమా కూడా హనుమాన్ జంక్షన్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

2- భద్రాచలం:
తెలంగాణలోని ఖమ్మం జిల్లా దగ్గర ఉన్న భద్రాచలం అందరికీ బాగా తెలిసిన ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ భద్రాచలం పేరుతోనే రియల్ స్టార్ శ్రీహరి ఈ పేరు పెట్టుకుని సినిమా తీశాడు సినిమా కూడా అతనికి సూపర్ హిట్ సినిమా గా ఉంది.

3- అరుణాచలం:
అరుణాచలం తమిళనాడులోని ఒక ఫేమస్ పుణ్యక్షేత్రం. ఇదే పేరుతో రజినీకాంత్ ఓ సినిమామా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు ఇందులో రజనీకాంత్ జోడిగా సౌందర్య- రంభ నటించారు.

Arunachalam Songs Download - Free Online Songs @ JioSaavn

4- అన్నవరం :
తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ఈ పేరుతోనే పవన్ కళ్యాణ్ అన్నవరం అనే సినిమా చేశాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

Prime Video: Annavaram

5- బొంబాయి:
బొంబాయి మత గొడవలను ఆధారంగా చేసుకుని మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టోరీ బొంబాయి నేపథ్యంలో తీశారు కాబట్టి టైటిల్ కూడా బొంబాయి.

Bombay - Must Watch Bollywood Movies - Pop Culture, Entertainment, Humor, Travel & More

6- గంగోత్రి:
అల్లు అర్జున్ డేబ్యు మూవీ గంగోత్రి. పవిత్ర పుణ్యక్షేత్రమైన గంగోత్రి బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా వ‌చ్చంది. కాబట్టి ఈ సినిమాకు గంగోత్రి అనే టైటిల్ పెట్టారు.

7- భీమిలి కబడ్డీ:
ఆంధ్రప్రదేశేలోని విశాఖపట్నం దగ్గర భీమిలి అనే ఊరు ఉంది. ఆ ఊరి పేరు ఆధారంగా నాని హీరోగా భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా నాని కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమా గా ఉంది.

8- కేరాఫ్ కంచరపాలెం:
ఆంధ్రప్రదేశేలోని విశాఖపట్నం దగ్గర కంచరపాలెం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో జరిగిన సంఘటనలు ఆధారంగా వెంకట్ మహా కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా తీశాడు సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.