అప్పుడు మహేష్ కోసం ఇ ప్పుడు ఎన్టీఆర్ కోసం.. విజయశాంతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన విజయశాంతి రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.తారక్ మూవీలో ఆనాటి అందాలతార.. ఎవరా హీరోయిన్ అంటేఎన్టీఆర్ RRR సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఎన్టీఆర్ కేవలం కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమాని పూర్తి చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ప్రాజెక్టు పనులు కూడా కాస్త ఆలస్యం అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కేవలం ఒక డైలాగ్ మోషన్ పోస్టర్ను మాత్రమే ఎన్టీఆర్ పుట్టినరోజునా విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ లేదు.తారక్ మూవీలో ఆనాటి అందాలతార.. ఎవరా హీరోయిన్ అంటే

ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తేరకేకిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు మోషన్ పోస్టర్ను చూస్తే మనకి అర్థమవుతోంది.. అయితే ఎన్టీఆర్ తో పాటు ఇందులో మరొక పవర్ఫుల్ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం ఆ పాత్ర కోసం లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతిని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు అత్త పాత్రలో ఈమె నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి విజయశాంతి ట్విస్ట్ హైలెట్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 14 ఏళ్ల తర్వాత మహేష్ తో నటించిన విజయశాంతి మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కెమెరా ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Share post:

Latest