పాన్నియన్ సెల్వన్-2 విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

తమిళంలో లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు పొందాడు డైరెక్టర్ మణిరత్నం. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా భారీ బడ్జెట్ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అలా తెలుగులో కూడా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. అయితే తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.ఈ సినిమా ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Ponniyin Selvan: History versus curiosity over onscreen portrayal of mighty  Cholas | Entertainment News,The Indian Express

ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంపై డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీన పోన్నియన్ సెల్వన్ మొదటి భాగం విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదలైన 9 నెలల లోపు పార్ట్-2 కూడా విడుదలవుతుందని తెలియజేశారు.

Dil Raju To Release Mani Ratnam's Ponniyin Selvan In Teluguఈ సినిమాని ప్రపంచ ప్రసిద్ధి రచయితగా పేరుపొందిన కల్కి రాసిన పోన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మణిరత్నం. చాలా రోజుల తర్వాత మనిరత్నం సినిమా రావడంతో అభిమానులు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మాత్రం దిల్ రాజ్ సమర్పణలో విడుదల చేస్తున్నారు మరియు సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest