అందుకే ఇండస్ట్రీ నుంచి దూరం కావాలనుకున్న కృష్ణంరాజు . కానీ..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు అన్న విషయాన్ని సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ లోకం ఒక్కసారిగా మూగపోయిందని చెప్పవచ్చు. ఇక ఆయన పార్థివ దేహానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు కూడా నివాళులర్పిస్తున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు గీతాకృష్ణ నిర్మాణ సంస్థ ద్వారా కూడా ఎన్నో చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తన గుర్తింపును పదిలం చేసుకున్నారు. ఇకపోతే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్ అని చెప్పాలి. వెండితెరపై కృష్ణంరాజు మొదటి సినిమా చిలకా గోరింక..

ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది. అయితే కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో కొంచెం దిగులు పడ్డ కృష్ణంరాజు ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే అనేచిత్రంలో విలన్ గా అవకాశం రావడంతో పూర్తిగా కృంగిపోయిన కృష్ణంరాజు సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ పాత్ర ఏదైనా సరే ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వి ప్రసాద్ హితబోధ చేయడంతో ఆలోచనలో పడ్డాడు కృష్ణంరాజు. ఇక ఆ తర్వాత నూతన ఉత్సాహంతో మళ్లీ నేనంటే నేనే అనే సినిమాలో విలన్ పాత్ర పోషించారు.LV Prasad has acted in the first talkies of three industries | Telugu Movie  News - Times of India

ఇక కొత్త జీవితం మొదలుపెట్టిన కృష్ణంరాజు ఆ సినిమాలో ఆనంద్ అనే విలన్ పాత్రలో పోషించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆ రోజు నుంచి నటుడు గా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. ఇక రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. లోకసభ నాయకుడిగా.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది.

Share post:

Latest