బూతుల యుద్ధం: తగ్గట్లేదుగా..!

రాజకీయాల్లో ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎవరు…ఎవరిని టార్గెట్ చేసి రాజకీయం చేసే వారు కదా..కేవలం విధానపరంగానే ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడుకోవడమే..అవి లేనిదే రాజకీయం నడవదు అనే పరిస్తితి. మామూలుగా ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలకు తగిన కౌంటర్లు ఇవ్వాలి.

కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగడం లేదు…టీడీపీ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తే చాలు..వైసీపీ నేతలతో బూతులతో సమాధానం చెబుతున్నారు. ఆ వెంటనే టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య బూతుల యుద్ధం జరుగుతుంది. వీరు ఎంతవరకు వెళ్లిపోయారంటే…ఫ్యామిలీల జోలికి కూడా వెళ్ళేయిపోయారు. వైసీపీ వాళ్ళు ఏమో చంద్రబాబు ఫ్యామిలీని, టీడీపీ వాళ్ళు ఏమో జగన్ ఫ్యామిలీని తిట్టుకునేలా పరిస్తితి ఉంది.

మరి ఈ స్థాయిలో దిగజారిపోయి..రెండు పార్టీల నేతలు బూతులు మాట్లాడుకుంటున్నారు. తాజాగా టీడీపీ నేతలు…ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతి ప్రమేయం ఉందని ఆరోపించారు…ఇక దీనికి సరిగ్గా కౌంటర్లు ఇవ్వలేదని మంత్రులకు జగన్ క్లాస్ పీకారు. టీడీపీకి కౌంటర్ ఇవ్వకపోతే మంత్రి పదవి కూడా తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంటే తిట్టమని డైరక్ట్ జగన్‌ చెప్పాక..మంత్రులు ఎక్కడా తగ్గలేదు..అలాగే వైసీపీ మహిళా నేతలు కూడా టీడీపీపై విరుచుకుపడ్డారు.

ఏ స్థాయిలో అంటే అసలు గతంలో భువనేశ్వరి, బ్రాహ్మణిలు లిక్కర్ దందాలు చేసేవారు అని, వారు మందు తాగి కొట్టుకున్నారని చెప్పి వైసీపీ మహిళా నేత మరి దిగజారి విమర్శించేశారు. ఇటు టీడీపీ కూడా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. తాజాగా కొడాలి నాని లైన్‌లోకి వచ్చి…తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. ఇక నాని లాంగ్వేజ్ గురించి తెలిసిందే. అటు నానిపై టీడీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. ఇలా రెండు పార్టీల నేతలు బూతుల యుద్ధంతో ముందుకెళుతున్నారు. మరి ఇలాంటి రాజకీయాన్ని ప్రజలు హర్షిస్తారో లేదో చూడాలి.

Share post:

Latest