హవ్వ..గీతామాధురిని ముఖానే అలా అడిగేసిన స్టార్ డైరెక్టర్..అమ్మడు పగిలిపోయే ఆన్సర్ విన్నారా..!?

స్టార్ సింగర్ గీతామాధురి అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ కి మించిన అందంతో ..హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. పేరుకు స్టార్ సింగరే కానీ అమ్మడు అందం చూస్తే హీరోయిన్ అని అనాల్సిందే . టాలీవుడ్ యంగ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీత ఆ తరువాత దాక్షాయిని ప్రకృతికి జన్మనిచ్చి ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

 

తెలిసిందే స్టార్ సింగర్ గీతామాధురి పాట పాడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే .అంతే కాదు సినిమా ఫ్లాప్ అయినా సరే అమ్మడు పాడిన పాట రికార్డులు కొల్లగొట్టాల్సిందే .అవార్డు అందుకోవాల్సిందే. అలా జరిగిన చరిత్ర అమ్మడికి చాలానే ఉన్నాయి. అలా గీతామాధురి తన పాటలతో మెప్పించిన తీరు జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది . ఇండస్ట్రీలో చాలామంది సింగర్స్ ఉన్న జనాలు గీతామాధురి వాయిస్ కి అడిక్ట్ అయిపోయారు ఆమె వాయిస్ లో తెలియని మత్తు హస్కినెస్ ఓ తెలియని ఫీలింగ్ అందరికీ వస్తుంది.


అలా గీతామాధురి పాడిన పాటలలో “మగాళ్లు ఒట్టి మాయగాళ్ళు సాంగ్” కూడా హైలెట్ గా మారింది . ఆ పాటలో ఆమె పాడిన తీరు గొంతు ఇప్పటికి జనాలను మత్తెక్కిస్తుంది. ఈ పాట విన్న ఎవరైనా సరే నిజంగా గీతామాధురి మందు తాగే పాట పాడిందా అని అనుకోవాల్సిందే . కానీ కాదు గీతామాధురికి అసలు డ్రింకింగ్ అలవాటే లేదు. అయితే ఈ పాట పాడడం కోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గీతామాధురిని మీకు మందు తాగే అలవాటు ఉందా..? అలా తాగి పాట పాడితే ఇంకా బాగుంటుంది ..అని చెప్పుకొచ్చారట.

కానీ “గీతామాధురి నాకు డ్రింకింగ్ అలవాటు లేదు ..నేను తాగను ..కానీ, మీరు కోరిన విధంగా ఈ పాటను పాడగలరు నేను” అంటూ ఒక్క షాట్ లోనే పాట పాడి డైరెక్టర్స్ ని మెప్పించిందట . అంతేకాదు ఈ పాట విన్న హీరో గోపీచంద్ కూడా గీతామాధురిని ఓ రేంజ్ లో పొగిడేసారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాదు గీతామాధురికి పలువు డైరెక్టర్స్ హీరోయిన్ గా కూడా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె ఆఫర్స్ కి లొంగలేదు తన ప్రయాణం మొత్తం సింగింగ్ తోనే సాగిస్తానని కరాకండిగా చెప్పేసింది. ప్రజెంట్ తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ ఇండస్ట్రీలో టాప్ సింగర్ లిస్టులో దూసుకుపోతుంది గీతామాధురి.

Share post:

Latest