బాలయ్య పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీహరి భార్య..!!

దివంగత నటుడు శ్రీహరి ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇండస్ట్రీలో శ్రీహరి అంతటి నటుడు మరెవరు రారని కూడా చెప్పవచ్చు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనారోగ్య సమస్య కారణంగా సడన్గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో చేరిన వెంటనే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరణించడం జరిగింది. వ్యక్తిగతంగా శ్రీహరి ఎంతో గొప్ప వ్యక్తి .. ఆయన ఎందరికో సహాయం చేశారని , ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. శ్రీహరి భార్య శాంతి ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ ఈ విషయాలను తెలిపింది.

Disco Shanti Wiki, Biography, Husband, Age, Family, Net Worth and More

కరెక్ట్ గా వచ్చి ఉంటే మరోకలాగా తమ పరిస్థితి ఉండేదని, శ్రీహరి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ఇంటిపైనే అప్పులు చాలా పెరిగిపోయాయి అని అందుకోసం తన నగలు కూడా అమ్మేశానని తెలియజేసింది. అలాగే తమ వద్ద ఉన్న కార్లు కూడా అమ్మేశామని తెలిపింది. చిరంజీవి గారి సంస్థ తో సహా మరో రెండు మూడు సంస్థలు మాత్రమే శ్రీహరి గారికి కరెక్టుగా రెమ్యూనరేషన్ ఇచ్చారని చాలామంది మోసం చేశారని కూడా తెలియజేసింది.

Balakrishna Says He Is Ready To Take Up A Villain's Role: “My Only  Condition Is, I Must Be The Hero Too”
అయితే శ్రీహరి గారికి సినిమాలు అంటే చాలా పిచ్చి.. అందుచేతనే డబ్బులు ఇవ్వకపోయినా సరే ఎన్నో సినిమాలలో నటించారని తెలిపింది . శ్రీహరి చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరూ తమని పట్టించుకోలేదు.. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే బాలకృష్ణ గారు ఫోన్ చేసి తమను మాట్లాడించారని తెలియజేసింది. అయితే బాలయ్య గారికి తమ కుటుంబానికి ఫోన్ చేయవలసిన అవసరం కూడా లేదని , కానీ తను చేసి మాట్లాడడంతో కాస్త ధైర్యం వచ్చింది అని తెలిపింది. ఇక బాలకృష్ణ సినిమాలో శ్రీహరి గారు ఒక సినిమాలో క్యారెక్టర్ లో చేశారట .. అందుకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఏదైనా సహాయం కావాలన్నా అడగండి అని తెలియజేశారట.. దీంతో శాంతి శ్రీహరి గారు చనిపోయిన తర్వాత కూడా తను నటించిన సినిమాలు చాలానే విడుదలయ్యాయి కానీ బాలకృష్ణలా ఎవరు ఫోన్ చేయలేదని తెలియజేస్తోంది శాంతి.

Share post:

Latest