ఆ కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్..!

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కకపోతే..టీడీపీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే బాబు..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. బలమైన అధికార వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు…టీడీపీ నేతల చేత పనిచేయిస్తున్నారు. అలాగే పనిచేయని నేతలకు గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు.

ఇక బలమైన నేతలకు ఇప్పటినుంచే సీట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి బలం కమ్మ నేతలు..ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ నేతలు గట్టిగానే ఉన్నారు. గత ఎన్నికల్లో చాలామంది కమ్మ నేతలు దారుణంగా ఓడిపోయారు. ఆ దెబ్బ టీడీపీపై గట్టిగా పడింది. అయితే ఈ సారి ముందుగానే కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్ చేసి..రాజకీయ యుద్ధంలో ముందు పెట్టాలని బాబు చూస్తున్నారు. ఇప్పటికే పలు సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు.

ఇదే క్రమంలో కొన్ని సీట్లని కమ్మ నేతలకు దాదాపు ఫిక్స్ చేసినట్లే అని తెలుస్తోంది. ఎలాగో ప్రకాశం జిల్లాలో పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ మళ్ళీ పోటి చేయడం ఖాయం. అటు ఒంగోలులో దామచర్ల జనార్ధన్ పోటీ చేయనున్నారు. గుంటూరుకు వస్తే పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండలో జీవీ ఆంజనేయులు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేయడం ఫిక్స్.

కృష్ణా జిల్లాలో మైలవరంలో దేవినేని ఉమా, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్, పెనమలూరులో బోడే ప్రసాద్, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు పోటీ చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్, తణుకులో అరిమిల్లి రాధాకృష్ణా బరిలో ఉండనున్నారు. ఇంకా ఇతర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ నేతలు పోటీ చేయనున్నారు. మరి ఈ సారి కమ్మ నేతలు సత్తా చాటుతారో లేదో చూడాలి.

Share post:

Latest