శ్రియా సరన్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తయినప్పటికీ అదే చలాకీతనంతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. తెలుగు, హిందీ, తమిళం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శ్రియా.. దక్షిణాది స్టార్ హీరోలు అందరితో కలిసి మెప్పించింది. ఇకపోతే అడపాదడపా సినిమాలలో చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రియా ప్రస్తుతం తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది . అంతేకాదు తన ముద్దులొలికే పాపాయితో ఈమె చేసే ఫోటోషూట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

Shriya Saran says Gamanam will make her daughter Rada proud | Entertainment  News,The Indian Express

శ్రియా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అదే స్లిమ్ ఫిట్నెస్ ను మెయింటైన్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె ఇటీవల బికినీ అందాలతో షేర్ చేసిన ఫోటోలు అందుకు నిదర్శనం.. పిల్లల తల్లి అయ్యుండి కూడా ఇంత అందం ఎలా సొంతం అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రష్యా కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూని వివాహం చేసుకున్న తర్వాత ఈమె అక్కడే సెటిల్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ ఉంటే తప్ప మరే విషయాలపై ఆమె పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇకపోతే ఈమె ప్రాపర్టీ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Shriya Saran blessed with baby girl with husband Andrei Koscheev, actress  shares adorable video! | People News | Zee News

ముంబైలో ఈమెకు ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక ప్రస్తుతం ఈమె వద్ద 12 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 90 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు కొన్ని ల్యాండ్స్ తో పాటు అలాగే సుమారుగా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసి కార్ లు, శ్రీపా సెంటర్ ఈమె ప్రాపర్టీ లో భాగంగా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం శ్రియా సినిమాలలో పెద్దగా నటించకపోయినప్పటికీ ఆస్తులను మాత్రం బాగా కూడబెట్టినట్లు తెలుస్తోంది.

Share post:

Latest