ఆసక్తికరంగా “ఓకే ఓక జీవితం” ట్రైలర్..శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!!

కుర్ర హీరో శర్వానంద్ రితు శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైలర్ ఈరోజ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ శర్వానంద్ నటించిన సినిమాలు కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని అమల కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే హీరోకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. హీరో మరియు హీరో స్నేహితులు ఒక శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటారు. అతను ఒక టైం ట్రావెలర్.. భవిష్యత్తు నుంచి జ‌రిగిపోయిన కాల‌నికి ప్రయాణించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు.

Sharwanand's next is Oke Oka Jeevitham

జ‌రిగిపోయిన కాలంతో జ‌రిగిన గతాన్ని మార్చడానికి వెళ్తారు. గతంలో ముగ్గురితో అసలు ఏ, జరిగింది మరియు వారు దానిని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? వాటన్నింటికీ సమాధానం ధియేటర్‌లోనే లభిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ని ఆసక్తి కరంగా మార్చింది. సైన్స్ ఫిక్షన్ డ్రామా ను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించడం జరిగింది. సెప్టెంబర్ 9, 2022 న తెలుగు మరియు తమిళంలో విడుదల కానున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాని నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వ‌హించ‌రు.

Share post:

Latest