హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈటీవీ ప్ర‌భాకర్ కొడుకు…!

బుల్లి తెర మెగాస్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాకర్ కూమారుడు చంద్రహాస్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా అడుగు పెట్ట‌బోతున్నాడు. చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రహాస్ ని ప్రభాకర్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమా నుంచి హ్యాపీ బర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌ లను చంద్రహాస్‌ తల్లి మలయజ లాంచ్‌ చేశారు.

Actor Prabhakar Confirmed His Son Chandrahas Tollywood Entry, Deets Inside

ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ, “నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయినా.. మీడియాతో ఇంటరాక్ట్‌ అవడం అరుదు. ఇప్పుడు ఈ ప్రెస్‌ మీట్ పెట్ట‌డానికి కారణం మా అబ్బాయి చంద్రహాస్‌ కూడా ఈ ఇండస్ట్రీని నమ్ముకుని నటననే ప్రొఫెషన్‌గా చేసుకుని ఇండస్ట్రీలో ముందుకు వెళుతున్నాడు. తండ్రిగా వాడికి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక ఇలా నా వంతు ప్ర‌య‌త్నంగా చేస్తున్నాను. చంద్రహాస్‌ హీరో కావాలని స్క్రీన్ మీద త‌న‌ని చూసుకొవాల‌ని కేవలం త‌న కోరిక మాత్రమే. అయితే అస్స‌లు ఈ విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్ లేదు. చాలా కాలం నుంచి యాక్టర్‌ అవుతా అంటువుండేవాడు.. కానీ నేను మాత్రం ఇప్పుడే వద్దు, ఫ‌స్ట్ చదువు పూర్తి చెయ్యి అంటూ అనేవాడిని. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువు కంటూనే, మరోవైపు సినిమా హీరోకు కావాల్సిన ఫైట్స్‌, డాన్స్‌లు, యాక్టింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు.

Prabhakar Son Chandra Hass Introduction As Hero *Entertainment | Telugu  FilmiBeat - video Dailymotion

ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వు డాడీ దాంతో నేను యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్ స్టార్ట్ చేసుకుంటాను. అలా చేసిన నాటు నాటు అనే కవర్‌ సాంగ్ చంద్రహాస్‌ మంచి పేరు తెచ్చి.. సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. చంద్రహాస్‌ మాట్లాడుతూ, “నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి తో పాటు అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ ల మధ్య సినిమాలు, టీవీ సీరియల్స్ ఇలా షూటింగ్‌ల వాతావరణం లోనే పెరిగాను. అందుకే నాకు సినిమా మీద ఆసక్తి పెరిగింది. హీరో అవ్వాలనేది నా ఆల్ టైమ్ డ్రీమ్‌. దీని కోసం నాన్నగారిని ఎంతగానో విసిగించా.. ఆయన మాత్రం నీకు ఇంకా అంత వయస్సు రాలేదు అనేవారు.

నాకేమో ఎప్పుడెప్పుడు హీరో అయిపోదామా అనిపించి ఇక ఆగలేక నాటు నాటు కవర్‌ సాంగ్‌ చేశాను. అది చూసి నాకు హీరోగా అవకాశం ఇచ్చారు మా దర్శక, నిర్మాతలు. మీడియా స‌పోర్ట్ లేనిదే ఏ ఆర్టిస్ట్‌కి గుర్తింపు ఉండదు. అందుకే మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ముందుగా మిమ్మల్ని కలిసేందుకుకలిసేందుకు మీ ముందుకు వచ్చాం అన్నాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రహాస్‌ చిత్రాల నిర్మాతలు, దర్శకలు, ఇతర టెక్నీషియన్స్‌ ను వేదిక మీదకు పిలిచి మీడియాకు పరిచయం చేసి వారి అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.

Share post:

Latest