పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట.

దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉంది. నరసారావుపేట పార్లమెంట్ మొత్తం పల్నాడు జిల్లా అయిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న ఏడు సీట్లని గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. నరసారావుపేట, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, పెదకూరపాడు సీట్లు వైసీపీ వన్ సైడ్‌గా గెలుచుకుంది. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ వేవ్‌లోనే గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలు సొంతంగా బలం పెంచుకోవడంలో విఫలమయ్యారని తెలుస్తోంది.

మొదట చూసుకుంటే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు పెద్ద పాజిటివ్ లేదు. పైగా ఈయన ప్రత్యర్ధి టీడీపీ నేత జీవీ ఆంజనేయులు బలపడ్డారు. దీంతో నెక్స్ట్ సీటు మళ్ళీ బొల్లాకు ఇస్తే గెలుపు కష్టమని తెలుస్తోంది. అందుకే ఈ సీటు మార్చాలని జగన్ చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున్, మరో ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు ఈ సీటు కోసం ట్రై చేస్తున్నారట.

అటు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుని మార్చాలని రెడ్డి వర్గం డిమాండ్ చేస్తుంది. సొంత వ్యాపారాలు చూసుకుంటూ నంబూరు..నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, ఈయన్ని మార్చాలసిందే అని డిమాండ్ వస్తుంది. అలాగే మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో పాజిటివ్ లేదు. ఈయన అవనిగడ్డ లేదా రేపల్లె సీటు కావాలని కోరుతున్నారట. అటు చిలకలూరిపేటలో మంత్రి విడదల రజినికి..యాంటీగా మర్రి రాజశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గాలు ఉన్నాయి. ఈమెకు మళ్ళీ సీటు ఇస్తే గెలుపు డౌట్ అని అంటున్నారు.

అటు గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిలకు పడటం లేదు. కాసు సీటు కూడా మారుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఖచ్చితంగా సీట్లు దక్కేది మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, నరసారావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే.

Share post:

Latest