సమంత చేయాల్సిన పని ..ఇప్పుడు నాగార్జున చేస్తున్నాడుగా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే..!?

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటుంటారు ఇంట్లో పెద్దవాళ్లు . బహుశా సమంత నాగచైతన్య విషయంలో అదే జరిగింది అనుకుంటా . అందుకే చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు బ్రతుకుతున్నారు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టార్ హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ళ మనసులు కలిసాయి.. ఆ తర్వాత మెల్లగా ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నట్లు చెప్పుకొని.. కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్నారు .

ఆ తర్వాత వన్ ఫైన్ డే నాగచైతన్య ఇంట్లో విషయం చెప్పడంతో నాగార్జున సమంత ను పిలిపించి విషయాన్ని అఫీషియల్ గా కన్ ఫామ్ చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకున్న తర్వాత గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ కి ప్లాన్ సెట్ చేసుకొని ఈ విషయాన్ని మీడియా కి, అభిమానులకి అధికారికంగా తెలియజేశారు . అంగరంగ వైభవంగా జరిగిన సమంత నాగచైతన్య పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్ గా వినిపించింది.

సీన్ కట్ చేస్తే పట్టుమని పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే ఈ జంట విడాకులు తీసుకుంది . రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఒకరిపై ఒకరికి మాత్రం చంపుకునే అంత పగ ఉంది అంటూ రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో సమంత బయట పెట్టింది. కాగా సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు నాగచైతన్య సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంతనే దగ్గరుండి చూసుకునేదట .నాగచైతన్య ఫుడ్ డైట్ , మనీ సేవింగ్స్ ,ప్రాపర్టీస్ కలెక్షన్ ,కాల్ షీట్స్ మేనేజింగ్ అన్ని సమంతనే చూసుకుందట. ఇప్పుడు సమంత విడాకులు ఇవ్వడంతో ఆ బాధ్యతలన్నీ నాగార్జుననే చూసుకుంటున్నాడు. అంతేకాదు సమంత విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య సినిమా సెలక్షన్స్ విషయంలో దారుణంగా ఉన్నాడంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పాపం నాగచైతన్య ని ఒంటరి చేసి నాగార్జునకు పని భారం పెంచేసి సమంత ఒంటరిగా బ్రతుకుతుంది.

Share post:

Latest