నయనతార బాటలో సమంత.. కానీ ఏం లాభం..?

సినీ ఇండస్ట్రీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ వంటి సన్నివేశాలకు ఎప్పుడు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆఖరికి సినిమా ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక విగ్నేష్ ను వివాహం చేసుకోవడానికి ముందు తన అత్త ఒక కండిషన్ పెట్టిందట .. బోల్డ్ , లిప్ లాక్ సన్నివేశాలలో నటించను అంటేనే సినిమాలలో నటించు.. లేకపోతే వద్దు అని చెప్పడంతో.. ఆమె కూడా సరేనని చెప్పి.. ప్రస్తుతం అలాంటి పాత్రలకు దూరంగా ఉంటోంది. ఇక పెద్దలు చెప్పిన మాటలు విని సంసార జీవితాన్ని , సినీ జీవితాన్ని కూడా సంతోషంగా కొనసాగిస్తోంది నయనతార.Nayanthara and Samantha Ruth Prabhu are the new besties in town, see photo  | Entertainment News,The Indian Express

ఇప్పుడు నయనతార బాటలోనే సమంత కూడా నడవాలని ఆలోచిస్తోంది.. సమంత గతంలో బోల్డ్ సన్నివేశాలలో , లిప్ లాక్ సన్నివేశాలలో నటించిన విషయం తెలిసిందే . ఇక ఈ పాత్రలే తనను తన కుటుంబం నుంచి దూరం చేశాయని చెప్పవచ్చు. ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించిన సమంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది కానీ కుటుంబం నుంచి కలహాలను తీసుకొచ్చింది. ఇక ఇలాంటి పాత్రలలో నటించవద్దని కుటుంబ సభ్యులు కోరడంతో ససేమీరా చెప్పిన సమంత .. ఏకంగా తాను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న భర్తను కూడా కాదనుకొని విడాకులు ఇచ్చి దూరం అయింది.Who is the popular south actress Samantha or Nayanthara? | IWMBuzz

కానీ ఇప్పుడు సమంత కళ్ళు తెరుచుకున్నట్టు తెలుస్తోంది .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె బోల్డ్ , లిప్ లాక్ సన్నివేశాలకు దూరం కానుందట. అంతేకాదు ఇలాంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా చెయ్యను అని చెబుతోందట.. అయితే ఇది తెలుసుకున్న అభిమానులు కాస్త సమంత చాలా ఆలస్యంగా కళ్ళు తెరుచుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఆమె అప్పుడే పెద్దలు చెప్పినట్టు నడుచుకొని, ఇలాంటి పాత్రలు చేయనని చెప్పి ఉంటే ఈరోజు ఇన్ని రూమర్స్ కి , కాంట్రవర్సీలకు గురి అయ్యేది కాదు కదా? భర్తతో సంతోషంగా జీవించేది కదా!.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest