సాయి పల్లవిని దారుణంగా అవమానించిన సైమా అవార్డ్స్‌.. ఇదెక్కడి అన్యాయం..!

ఒకప్పుడు సినిమా అవార్డులు వస్తే నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతో మురిసిపోయేవారు. ఈ సినిమా అవార్డులకు మంచి వ్యాల్యూ కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇచ్చే దాదాపు చాలా సినిమా అవార్డులకు ఎవరూ కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ అవార్డులను నిర్వాహకులు తమకు నచ్చిన వారికి అందజేస్తున్నారనే ఒక బలమైన నమ్మకం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్కోసారి అర్హతలేని నటీనటులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. బాగా నటించే వీరికి అవార్డు రావడం పక్క అనుకున్నా… వారికి మాత్రం ఎలాంటి పురస్కారాలు లభించడంలేదు. దీంతో వీటిలోని డొల్లతనం స్పష్టమవుతోందని ఆడియన్స్ తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి సినీ అవార్డులలో నటీనటులకు ఎంత అన్యాయం జరుగుతుందో బయటపడిందని సినీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 2021 సంవత్సరంలో తీసిన సినిమాలు, మ్యూజిక్‌కి సంబంధించి సెప్టెంబర్ 10, 11 తేదీల్లో సైమా 2022 అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగులో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హీరోయిన్ పూజా హెగ్డే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది. దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సైమా నిర్వాహకులు సాయి పల్లవి తీవ్ర అన్యాయం చేశారని సినీ ప్రేమికులు విమర్శిస్తున్నారు.

2021లో విడుదలైన శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఒక దేవదాసిగా సాయి పల్లవి సినీ ప్రేక్షకుల మనసులను దోచేసింది. అలాగే బాల్యంలోనే లైంగిక దాడికి గురైన బాధితురాలిగా లవ్ స్టోరీ సినిమాలో గొప్పగా నటించేసింది. ఇలాంటి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సాయిపల్లవిని కాదని పూజా హెగ్డేకి అవార్డు ఇవ్వడం నిజంగా ఆమెను అవమానించినట్లేనని చాలా మంది మండిపడుతున్నారు.

శ్యామ్ సింగ రాయ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని సైమా జ్యూరీ భావించి ఉండొచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో రొమాన్స్, డ్యాన్స్ మొదలైన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక లవ్ స్టోరీ కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. కానీ సాయి పల్లవికి ఒక అవార్డు కూడా ఇవ్వకుండా సైమా జ్యూరీ అన్యాయం చేసింది. సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో ఆమెను ఒక నటిగా కూడా ఈ అవార్డుల ఫంక్షన్ గుర్తించకపోవడం ఇప్పుడు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.