హీరోయిన్ సాయి పల్లవి సంచలన నిర్ణయం.. సినిమాలను ఆపేసి ఏం చేస్తుందో తెలుసా..?

సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్, అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. సాయి పల్లవి చాలా చిన్నవయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2014లో మలయాళ సినిమా `ప్రేమమ్` లో హీరోయిన్‌గా నటించి అందరి దగ్గర మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత 2017 లో శేఖర్ కమ్ముల‌ డైరెక్షన్లో వచ్చిన `ఫిదా` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించి అందరి మనసును ఫీదా చేసింది.

ఇటీవ‌ల కాలంలో నాచురల్ స్టార్ నాని సినిమా `శ్యామ్ సింగరాయ్` సినిమాలో నానికి జోడిగా చేసి తన నటనతో డాన్స్ తో అందరినీ మై మరిచిపోయేలా చేసింది. సాయి పల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

రీసెంట్‌గా గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్లో గార్గి అనే సినిమాలో నటించింది. ఇక ఆ తరువాత సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన విరాటపర్వం ఈ రెండు సినిమాలు కూడా భారీ డిజాస్టర్ అయ్యాయి. వరస ప్లాపులతో సాయి పల్లవి కెరీర్ మీద కోలుకోలేని దెబ్బ పడింది. ఇక సినిమాలు వరుసుగా ఫ్లాప్ కావడంతో సాయి పల్లవి కొద్ది రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇద్దామని ఒక సంచలన నిర్ణయం తీసుకుంద‌ని టాక్‌.

సాయి పల్లవి ఇక సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికిందో ఏమో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు చెక్కేసింది. అయితే లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే సాయి పల్లవి తన వెకేషన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోలను ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తోంది.

Share post:

Latest