రవితేజ కోసం రంగంలోకి దిగిన రేణూ దేశాయ్.. కలిసొస్తుందా..?

రవితేజ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి తర్వాత అంతటి ఇమేజ్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు ప్లాప్ లతో కొట్టుమిట్టాడిన రవితేజ 2021 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్టులు ఈయన చేతిలోకి వచ్చాయి. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం గమనార్హం. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించ లేకపోయాయి. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Renu Desai as Ravi Teja sister రవి తేజ సిస్టర్ గా రేణు దేశాయ్
ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు వదినమ్మ అని ఎంతో ప్రేమగా పిలిపించుకునే ఈమె.. అంతే పద్ధతిగా వారి ఆదరాభిమానాలను పొందుతూ ఉంటుంది. విడాకుల తర్వాత కూడా భర్తను ఒక స్నేహితుడిలా చూస్తూ.. పిల్లలను భర్తకు, భర్త కుటుంబానికి దగ్గర చేస్తున్న రేణు దేశాయ్ వ్యక్తిత్వం అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతమైన ఇష్టం. ఇక ఇటీవల ఆమె సినిమాలలో రీఎంట్రీ ఇవ్వడానికి కష్టపడుతోంది అనే వార్తలు వినిపించాయి..ఇకపోతే బుల్లితెరపై ఒక షోకి జడ్జిగా వ్యవహరించి మెప్పించిన రేణూ దేశాయ్ ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియక అందరూ డైలమాలో పడ్డారు.

ఎట్టకేలకు రేణూ దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని రేణూ తెలిపింది. హేమలత లవణం గారి లాంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను చేయగలను అని నన్ను నమ్మి దర్శకుడు వంశీకృష్ణ నాకు అవకాశం ఇచ్చారు.. ఇక ఆయనకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రవితేజకు అక్క పాత్రలో నటించబోతోంది రేణు దేశాయ్. కనీసం రేణు దేశాయ్ వల్ల అయినా ఆయనకు విజయం దక్కుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Share post:

Latest