తోడు కావాలి అంటున్న రేణు దేశాయ్..

రేణుదేశాయ్ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది .తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ,2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన బద్రి సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు .ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది .ఆ తర్వాత కాలంలోనే వీరిద్దరూ సహజీవనం మొదలయ్యింది.అప్పట్లో ఆ వార్త పెద్ద దుమారమే లేపింది .రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో సహజీవనం మొదలైన తర్వాత సినిమాలో నటించడం ఆపేసారు .

2004 సంవత్సరంలో పెళ్లి కాకా ముందే వారికీ అకిరా పుట్టాడు .తర్వాత 2009 లో వీరిద్దరూ తమ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు .ఆ తర్వాత వీరికి అధ్య పుట్టింది .అయితే వీరికి అధ్య జన్మించిన తర్వాత 2013 లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు ,కానీ పిల్లల కొరకు తల్లితండ్రులుగానే కొనసాగుతున్నారు .కొన్నిరోజులు పిల్లలతోనే సమయం గడిపిన రేణు దేశాయ్ ,తర్వాత 2018 లో తోడు అవసరం ఉందని పలుమార్లు ఆవిడా అన్నారు ,తరవాత ఒక వక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయిందని వార్తలు వచ్చినా ఆవిడా మాత్రం స్పందించా లేదు .ఇప్పుడు మరల రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి అని పోస్ట్ చేశారు.అయితే రేణు దేశాయ్ ఈ పోస్ట్ ని ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియోని పోస్ట్ చేశారు .అంతే కాకుండా ఇంకొక పోస్ట్ లో మీ సోల్ మెట్ వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్ధం చేసుకోండి అని కామెంట్ పెట్టారు .చాల రోజులు తర్వాత ఎలాంటి పోస్ట్ పెట్టడం వలన రేణు దేశాయ్ నిజంగానే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం వుందా అని ఫాన్స్ కి తెలియాల్సి వుంది.

Share post:

Latest