రవీందర్.. మహాలక్ష్మికి కట్నం కింద ఎంత బంగారం పెట్టాడో తెలిస్తే షాక్..!

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ ను బుల్లితెర నటి వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇకపోతే పెళ్లయిన రోజు దగ్గరనుంచి వీరి జంట హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వీరు సోషల్ మీడియాలో ఏం చేసినా సరే వైరల్ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వీరిపై విపరీతంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. దీంతో మహాలక్ష్మి దయచేసి తన భర్తను అవమానించద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ కూడా పెట్టింది.

Actress Mahalakshmi marries producer Ravinder Chandrasekaran, wedding  pictures are winning hearts - Youthistaan

ఇదిలా ఉండగా తాజాగా మహాలక్ష్మి , రవీందర్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అదేమిటంటే మహాలక్ష్మికి పెళ్లి సందర్భంగా రవీందర్ ఇచ్చిన కానుకలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మహాలక్ష్మి పై ప్రేమతో రవీందర్ భారీ కానుకలను ఇచ్చారట. అంతేకాదు ఆమెకు బంగారు పూత పూసిన మంచాన్ని కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.. ఇక అంతే కాదు మంచానికే బంగారు పూత పూయించి ఇచ్చిన రవీందర్ ఎన్ని కిలోల బంగారం ఇచ్చారు అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

Mahalakshmi: Mahalakshmi stated that about Ravinder final 12 months ‣ AllMaa

నటుడు రవీందర్ తన ప్రియమైన భార్యకు ఎంత బంగారం , బహుమతులు ఇచ్చాడు అనే విషయానికి వస్తే .. నటుడిగా , నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రవీందర్ భార్య కోసం సుమారుగా ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను తయారు చేసి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రముఖ తమిళ వ్యాఖ్యాతగా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న మహాలక్ష్మి.. ఇటీవల సెప్టెంబర్ ఒకటవ తేదీన తన భర్తతో కలిసి తిరుపతిలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఇక మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన రవీందర్ కి ఇది రెండవ పెళ్లి.. పెళ్లి తర్వాత మహాలక్ష్మి రవీందర్ దంపతులు యూట్యూబ్ ఛానల్స్ నుండి న్యూస్ చానల్స్ వరకు చాలా ఇంటర్వ్యూలలో కనిపించారు. ప్రస్తుతం వీరి జంట సోషల్ మీడియాలోనే వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం..

Share post:

Latest